Home Unknown facts సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని అని అంటారు ఎందుకు ?

సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని అని అంటారు ఎందుకు ?

0

హిందూ పండుగలు అన్నీ లునార్ క్యాలెండర్ ని ఆధారం చేసుకుని, చంద్రుడి స్థానాన్ని అనుసరించి జరుపుకుంటారు. అందువల్ల, ప్రతి సంవత్సరం పండుగల తారీకులు మారుతాయి. కానీ మకర సంక్రాంతి అనే పండుగ ప్రతి ఏటా ఒకేరోజు వస్తుంది, ఇది సోలార్ క్యాలెండర్ అనుసరించి జరుపుకుంటారు.

సంక్రాంతి“సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో “సంక్రాంతి”ని ఇలా విర్వచించారు – తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః – మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి.

సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల ఈ పండగను కుటుంబసభ్యులంతా కలిసి ఎంతో ఆనందాత్సోహాల మధ్య జరుపుకుంటారు. పండగల కోసం పట్టణ జనాలంతా పల్లెలబాట పట్టడంతో అక్కడ సరికొత్త సందడి వాతావరణం నెలకొంటుంది.

 

Exit mobile version