అఘోరాలు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో తెలుసా ?

అద్భుతమైన హిమాలయాలకున్న మనోజ్ఞత మాటల్లో వర్ణించలేనిది. హిమాలయ ప్రాంతాల్లో పర్యటన ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులు మళ్లీ మళ్లీ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ పర్యటన ఊహించిన దాని కంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని రీతిలో అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి. దేవతల నివాసంగా భావించే హిమాలయాల్లో అఘోరాలు, నాగసాధువులు నివసిస్తారు. వారంతా ఒక వింత రూపంలో ఉంటూ శరీరాన్ని బూడిదతో పూసుకొని వెంట్రుకలు ఆడవారిలా పెంచుకొని చేతిలో మానవుని పుర్రెను పట్టుకొని…. చూస్తేనే మనుషులు భయపడేలా ఉంటారు.

అఘోరాలుమరి ఇంతకు అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయి? వారి ఆహర నియమాలు ఏమిటి? వారు ఎక్కడ ఉంటారు? వారు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం. జనసంచారం ఉన్నచోట అఘోరాల ఎక్కువగా మనకు కనిపించరు. మనకు కనిపించేది ఒక్క కుంభమేళాలు లేదా పుష్కారాలలో మాత్రమే…. మరి మిగతా రోజులలో ఎక్కడ ఉంటారు అంటే వారు మానవ సంచారానికి దూరంగా నిశ్శబ్ద ప్రాంతాలలో ఉంటారు. వారు ఎక్కువగా ధ్యానంలో ఉంటూ రాత్రి సమయంలో స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తుంటారు. వీరు నరమాంసాన్ని ఇష్టపడటం, శవాలను ప్రేమించడం ఎక్కువగా చేస్తారు. మనకు ఎప్పుడైనా కనిపించినప్పుడు వారి చేతిలో మానవుని పుర్రె ఉంటుంది. అది కచ్చితంగా మగవారి పుర్రె అయి ఉంటుంది. ఎందుకంటే వారు ఆడవారి పుర్రెలను ఎట్టి పరిస్థితులలో ముట్టుకోరు. మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజులలో స్మశానంలో క్షుద్రపూజలు చేస్తూ పుర్రెని కళ్ళ పైభాగం నుంచి కోసేసి దానిని ఒక పాత్రలాగ చేస్తారు. వీరు తినే ఆహరం అంత ఈ పుర్రెలోనే తింటారు. అలాగే వీరు యాచించడం కూడా ఇదే పుర్రెలో యాచిస్తారు. నీటిని తాగేయందుకు మాత్రం వారు కమండలాని ఉపయోగిస్తారు.

అఘోరాలుమరి ఎందుకు ఇలా చేస్తారు! అంటే మాత్రం ఇలా చేయడం వల్లనే వారికి అద్భుతమైన శక్తులు కలుగుతాయని వారి నమ్మకం. ఇక వీరు ఎప్పుడు పరమ శివుని స్మరిస్తుంటారు. అఘోరాలు మామూలు రోజుల్లో ఎవరికీ కనిపించరు. కానీ కుంభమేళా, పుష్కరాలు జరిగే సమయంలో హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలకు వీరు కచ్చితంగా వస్తుంటారు. మరి కుంభమేళా జరిగే స్థలం కానీ లేదా అంత దూరం నుండి వారి ప్రయాణం ఎలా చేస్తారు అనే విషయం ఎవరికీ తెలియదు. మరి వీరు ఉండే ప్రాంతం నుండి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక, తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కనిపించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు?

అఘోరాలుఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు? వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం. అదే నానో టెక్నాలజీ. నానో టెక్నాలజీ అంటే పెద్ద పరిమాణాలను అతి చిన్న పరిమాణాలుగా(సూక్ష్మం) చేసి ఒక చోటు నుండి మరో చోటుకి తరలించడం, అఘోరాలు కూడా దేశంలో ఎక్కడ కుంభమేళా జరిగిన వేల సంఖ్యలో వస్తారు, కానీ వచ్చేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ఎవరికీ కనిపించరు, కేవలం కుంభమేళా జరిగే ప్రాంతంలో మాత్రమే కనిపిస్తారు, అఘోరాలు, నాగ సాధువులు నానో టెక్నాలజీ(సూక్ష్మ శరీరయానం )నే ఉపయోగించి ఎవరికీ కనిపించకుండా హిమాలయాల నుండి ఎక్కడికి అయిన వచ్చి తిరిగి వెళ్తున్నారని, పూర్వకాలంలోనే మన ఋషులు ఈ టెక్నాలజీల గురుంచి రాసిపెట్టారని హిమాలయలలో తపస్సు చేస్తే ఆ శక్తులన్నీ లభిస్తాయని కొంత మంది భావిస్తున్నారు.

అఘోరాలుఅఘోరాల సంగతి ఇలా ఉంటే ఇక నాగ సాధువులు ఈ అఘోరాల లాగ ఇంత కఠినంగా ఉండరు ఎందుకంటే వీరు ఎప్పుడు కఠినమైన ధ్యానంలో సాధన చేస్తుంటారు. వీరి అంతిమ లక్ష్యం మాత్రం మామూలు మానవులకు కనిపించని దేవున్ని వారు ప్రత్యేక్షంగా చూడటమే. అలాగే వీరు తీసుకునే ఆహరం మామూలు మానవులు తీసుకునే ఆహరమే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు వీరు ఆహరం, నీరు లేకుండా ధ్యానం చేయగలరు. నాగ సాధువులకు చాలా మహిమలు తెలుసు అంటూవుంటారు. దానికి కారణం వారు ఎప్పుడు దైవ ధ్యానంలో ఉండటమే. ఎప్పుడైనా కుంభమేళాలో గాని, పుష్కరాలలోగాని వారు వస్తే వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ వారి దగ్గర చాలా మంది ప్రజలు వారి కోరికలు చెప్పుకుంటారు. వారు కూడా భక్తుల కోరికలను తీరుస్తుంటారు. ఈనాగ సాధువులు గాలిలోనే ఏదైనా తాయత్తు లేదా బుడిదా తీసి భక్తులకు ఇస్తుంటారు. ఇలా చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే గాలిలో ఒక వస్తువును సృష్టించడం అంత సులువు కాదు. దీన్నే ఆధునిక విజ్ఞాన శాస్త్రం న్యూక్లియర్ ట్రాన్స్ మ్యుటేషన్ అని అంటారు.

అఘోరాలుఅలాగే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఉండే నాగ సాధువులు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. ఎప్పుడు హిమాలయాలోనే ఉండే అఘోర, నాగ సాధువులకి నిజంగానే అద్భుత శక్తులు ఉన్నాయా అనేది అంతుచిక్కని ప్రశ్నే, వారికి శక్తులున్నాయని వారు చెప్పుకోవడమే తప్పించి ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు లేరు, నెలల తరబడి హిమాలయాల్లోని మంచు పర్వతాలలో ఉండటం అనేది మాములు మనుషులకి సాధ్యం కాదు, కానీ అఘోరాలు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR