శివుడు శ్రీరామనామం గొప్పతనం గురించి పార్వతికి ఏమని వివరించాడో తెలుసా ?

0
2779

శ్రీరామనామం ఎంతో మధురమైనది. రామా నామ స్మరణ చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని చెబుతారు. శ్రీరామా శబ్దం జగత్తులోని మొట్టమొదటి మంగళకరమైన శబ్దం అని కాళిదాసు మహాకవి అన్నాడు. మరి శివుడు శ్రీరామనామం గొప్పతనం గురించి పార్వతికి ఏమని వివరించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

SriRamఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడిగింది, ప్రభు, పండితులు ఏ సూక్ష్మోపాయంతో సంక్షిప్తంగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పటించగలరో ఆ ఉపాయం గురించి వినాలని ఉంది అని అడుగగా, అప్పుడు శివుడు పార్వతీదేవితో, నేనెప్పుడు పూజ్యమైన శ్రీరామ నామాన్ని మూడుసార్లు ఉచ్చరించి ఆనందం పొందుతుంటాను. ఇలా అందరూ రామనామాన్ని జపిస్తే అది సహస్ర నామాలకు సమానమవుతుంది.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్త్యుల్యం రామ నామ వరాననే

Rama Mantramపద్మ పురాణంలో పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన ఈ తారక నామ రహస్యం అక్షర సంఖ్యాశాస్రా పరంగా కూడా సరిపోతుంది. అక్షర సంఖ్యలో యరలవ లో ర రెండో అక్షరం. మ ‘ప’ వర్గాల్లోని ఐదవ అక్షరం. రెండుని ఐదుతో హెచ్చువేస్తే పది అవుతుంది. అంటే ఒకసారి రామ శబ్దం ఉచ్చరిస్తే దాని విలువ పది అనుకుందాం. ఇప్పుడు మొదటి రామ శబ్దాన్ని, రెండో రామ అనే పదింటితో హెచ్చవేస్తే వెయ్యి అవుతుంది. ఈవిధంగా మూడుసార్లు రామనామం ఉచ్చరిస్తే వేయి విష్ణు నామాలు ఉచ్చరించినట్లు అవుతుంది. అందుకే ఇంత ప్రాధాన్యం కలిగిన పైరెండు పద్మ పురాణ శ్లోకాలను విష్ణు సహస్ర నామస్తోత్ర ఉత్తర పీఠికలో పెద్దలు చేర్చారు.

Sri Ramఇది ఇలా ఉంటె, శ్రీరాముని బంటు ఆంజనేయుడు నిత్యం రామనామ స్మరణ చేస్తుండేవాడిని పురాణాలూ చెబుతున్నాయి. ఆ రామనామంలో అమృతం ఉందని అంటారు. అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు ఈతిబాధలే కాదు మోక్షం కూడా తనకు తానై వస్తుంది.