Home Unknown facts పాతాళ లోకం గురించి మన పురాణాలు ఏమి చెబుతున్నాయి?

పాతాళ లోకం గురించి మన పురాణాలు ఏమి చెబుతున్నాయి?

0

చాలా సందర్భాల్లో కొందరికి అసలు పాతాళలోకం వుందా? లేదా? అంటూ కొన్ని సందేహాలొస్తూంటాయి. అయితే మనుషులు భూలోకంలో నివసిస్తే ఆకాశలోకంలో స్వర్గం వుంటుంది. అక్కడ దేవతలుంటారని చెబుతూవుంటారు.ఇంకా భూమి అంతర్భాగంలో పాతాళంలోలోకం వుంటుందని అంటూంటారు. మరి అసలు పాతాళలోకం నిజంగా వుందా? ఒకవేళ వుంటే ఎక్కడుంది? పాతాళంలోలోకం వెనుక దాగివున్న ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పాతాళ లోకంపురాణాల ప్రకారం మొత్తం మూడు లోకాలు ఉన్నాయి. అవే స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం.

స్వర్గలోకం:

దీన్నే స్వర్గమని అంటారు. ఇక్కడ దేవతలు నివసిస్తుంటారని ప్రతీతి. భూమిపై పుణ్యాలు చేసిన వారు స్వర్గ లోకానికి వెళ్తుంటారని చెబుతుంటారు. స్వర్గలోకం ఆకాశంలో ఉంటుంది.

భూలోకం:

మనం నివిస్తున్న భూమినే భూలోకం అంటారు. ఇక్కడ మానవులతో, జీవరాశులన్నీ ఇక్కడే నివాసముంటున్నాయి.

పాతాళ లోకం:

దీన్నే పాతాళం అని కూడా అంటారు. పాతాళ లోకం భూమి కింద భాగంలో ఉంటుందని, ఇక్కడ రాక్షసులు, యక్షులు, నాగజాతి వారు ఉంటారని చెబుతుంటారు.

సూర్యసిద్ధాంతం ప్రకారం సురాసురలకు ఒకరికి రాత్రైతే మరొకరికి పగలు.దేవతలకి మన కాలమానం ప్రకారం వారి పగలు ఆరునెలలు, రాత్రి ఆరునెలలు. వారి ఒక దినం మనకు ఒక సంవత్సరం.అలాగే మానవులకు పగలైనప్పుడు పాతాళంలో అది రాత్రి. మన భూమి నుండి 50,000ల యోచనాల దూరంలో పాతాళ లోకం వున్నట్టుగా చెబుతారు.

రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సాగరుని చరిత్ర చెబుతూ సాగారకుమారులు 60,000ల మంది కూడా ఎలా భూమిని వెతుకుతూ వెళ్ళారో భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో విస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిలముని ధ్యానభంగం చేయటం ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమైపోవటం,వారి భస్మాలపైన భూమినుండి గంగని అవతరింపజేసి,పారించి, పాతాళంలో వారి భాస్మరాసులపై ప్రవహింపచేసి వారిని తరింపజేస్తాడు భగీరథుడు.

ఆ ప్రదేశమే కపిలారణ్యంగా ప్రసిద్ధిచెందిందని చెప్తారు.అంతేకాకుండా రామరావణ యుద్ధసమయంలో రావణుడికి సోదర వరసైన మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి సొరంగమార్గం ద్వారా పాతాళానికి తీసుకువెళ్ళాడని రామాయణంలో వుంటుంది.ఆ సొరంగమార్గం మధ్యప్రదేశ్ లోని చింద్వారాజిల్లా పాటల్ కోట్ లో వుందని ఇప్పటికీ నమ్ముతారు హిందువులు. అదే మార్గంద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్లి రామలక్ష్మణులను కాపాడారని అక్కడ కధలుకధలుగా చెప్పుకుంటారు.

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు. భూమి కింద ఉండే పాతాళ లోకం (అండర్ వరల్డ్) ముగ్ధమనోహరంగా అత్యద్భుతంగా ఉంటుంది. చూస్తే ఇదే స్వర్గలోకమని, స్వర్గం కంటే అందంగా ఉందని అబ్బురపరుస్తుంది. ధనవంతులు, అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆశ్చర్యచకితులను చేస్తుంది. అయితే వాస్తవానికి ఇదంతా మన భ్రమే. రాక్షసులు పాతాళాన్ని పరిపాలిస్తుంటారు. దైత్యులు, యక్షులు, నాగజాతికి చెందిన వారు ఇక్కడ నివసిస్తుంటారు. ప్రముఖ ఖగోళ శాస్త్రం సూర్య సిద్ధాంతం ప్రకారం భూమి దక్షిణార్ధ గోళంలో పాతాళం, ఉత్తరార్ధ గోళాన్ని జంబూ ద్వీపం అని అంటారు.

విష్ణు పురాణం ప్రకారం నారదుడు పాతాళాన్ని సందర్శించాడు. ఎందుకంటే నారదుడు త్రిలోకాల్లో ఎక్కడికైనా సంచరించే అనుమతి కలిగి ఉన్న వ్యక్తి. పాతాళం లోకం అంటే చనిపోయే వాతావరణాన్ని సృష్టించేది అని ఆయన వర్ణించారు. పాతాళ లోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థల్లో ఉందని భాగవత పురాణం చెబుతోంది. రాక్షసుల వాస్తు శిల్పి మాయ రాజభవనాలు, దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించారని చెబుతారు. పాతాళంలో సూర్యరశ్మి ఉండదు. అంతా చీకటిగా మిళమిళా మెరుస్తున్న ఆభరణాలు వెలుగుతూ.. సహాజ కాంతిలేమిని భర్తీ చేస్తాయి.

నారదుడు విష్ణుపురాణం లో చెప్పిన ప్రకారం పాతాళంలో ఏడు రాజ్యాలు ఉన్నాయని చెబుతారు. అతళ, వితళ, నితళ, గర్భాస్తిమత్, మహాతళ, సుతళ, పాతళ అనే ఏడు రాజ్యాలు ఉన్నాయి. అదే భాగవత పురాణం, పద్మ పురాణాల ప్రకారం ఈ ఏడు రాజ్యాలను ఈ విధంగా పిలుస్తారు. అతళ, వితళ, సుతళ, తలాతళ, మహాతళ, పాతాళ అని అంటారు. శివ పురాణం ప్రకారం మహాతళ స్థానంలో తళా అనే రాజ్యముంటుంది. అదే వాయుపురాణంలో అయితే రసాతళ, సుతళ, గర్భస్ధల, శ్రీతళ, వితళ, పాతాళ అనేవి ఉన్నాయి. ఇలా అన్ని పురాణాల్లో పాతాళలోకం ప్రస్తావన ఉంది.

Exit mobile version