మహిళలు ఏ దేవుడి ఆలయానికి వెళ్ళినపుడు ఎలా వెళ్ళాలి?

0
481

కోరిన కోరికలు తీర్చిలని కొందరు, తీరిన కోరికలకు మొక్కలు చెల్లించడానికి కొందరు, మనసు ప్రశాంత కోసం మరికొందరు ఇలా ఏదో ఒక కారణంతో చాలామంది తరుచూ గుడికి వెళుతూనే ఉంటారు. ఇందులో ఎక్కువగా ఉండేది మహిళలు/స్త్రీలు. ప్రతి శుక్రవారం తప్పకుండా గుడికి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. అలా గుడికి వెళ్ళితే సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం.

Templeఅయితే గుడికి వెళ్లేటప్పుడు కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది సంప్రదాయమైన వస్త్రాలు వేసుకోవడం. అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు చీర,లంగా,ఓణీ వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి. అలాగే నుదుట తప్పనిసరిగా కుంకుమ ధరించాలి. తర్వాత గుడిలో ఇచ్చే పసుపు,కుంకుమను నుదుటి కుంకుమ కింద,విభూతి అయితే నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి.

Templeఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పుతున్నారు. వాటితో పాటు ఆయా దేవతాలయాలకు కొన్నిరకాల పండ్లు, పూలు, పదార్థాలు తీసుకువెళితే మరింత మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Durga Deviఅమ్మవారి దేవాలయానికి వెళితే…పసుపు, కుంకుమ, సుమంగళీ పదార్థాలు, దానిమ్మ పండ్లు, ఎర్రటి పూలను తీసుకెళ్లితే మంచిది. సరస్వతీ దేవి ఆలయానికి వెళితే తెల్లటి పూలు, పాయసం, పాలు వంటివి తీసుకుపోవాలి. అదే లక్ష్మీదేవి ఆలయానికి వెళితే కమలాలు, తామరలు, మారేడుదళాలు, తెలుపు, ఎరుపు, పసుపు పూలు తీసుకుపోవాలి.

Lord Shivaఇక వినాయకుని గుడికి వెళ్ళితే గరిక మాలను తీసుకువెళ్లాలి. గరిక మాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తిరటమే కాకుండా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను ఏవైనా బాధలు ఉంటే తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణు మూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలతో వెళ్ళాలి.

Hanumanఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు వెన్న లేదా సింధూరం, తమలపాకులను తీసుకోని వెళ్ళాలి. ఇక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళితే పుష్పమాల, మారేడు, తియ్యని ప్రసాదాలు తీసుకువెళ్లాలి. అదేవిధంగా దేవాలయానికి బయలుదేరిన దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు తప్పనిసరిగా భగవంతుడి ఆరాధనే చేయాలి. మనసు నిండా ఆయన గురించిన ఆలోచనలు లేదా ధ్యానశ్లోకాలను మాత్రమే స్మరించుకుంటూ పోవాలి. దేవాలయంలో ఎవరితో మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడం, నవ్వడం, పాటలు పాడటం లాంటివి చేయకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి.

Templeభారీగా అలంకరణలు చేసుకుని దేవాలయానికి వెళ్లకూడదు. అక్కడ మన ఆడంబరాలు, స్థాయి, అంతస్తులను చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు. గుడికి వచ్చే ప్రతీ ఒక్కరూ భక్తులే కాబట్టి అక్కడ తప్పక అందరినీ గౌరవించాలి. అక్కడ దర్పాలకు పోకూడదు. స్వామి/అమ్మమీద ధ్యాసతో అక్కడ ప్రతీదానిలో ఆ భగవంతుడి స్వరూపాన్ని దర్శించగలిగితే తప్పక భగవంతుడి ఆనుగ్రహం మనకు కలుగుతుంది. ఈ విధంగా చేస్తే ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.