రాగి పాత్రలో నైవేద్యం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి

వైష్ణవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడిఅర్చకులు రాగి పాత్రలోనే శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం పెట్టడం చూస్తుంటాం. అంతెందుకు కొన్ని గుళ్ళలో తీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగితోనే తయారు చేయబడి ఉంటాయి. ఎందుకు అలా చేస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయి. శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాలు తెలుసుకుందాం.

రాగి పాత్రలో నైవేద్యంపురాణాల ప్రకారం పూర్వం గుడాకేశుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. రాక్షస జాతిలో పుట్టినప్పటికీ అతను పరమ విష్ణుభక్తుడు. నిరంతరం స్వామి ధ్యాసలోనే ఉండేవాడు. ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు.

రాగి పాత్రలో నైవేద్యంకొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. తరువాత కూడా గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.

రాగి పాత్రలో నైవేద్యంవిష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారిపోయాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. అందుకే ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం.

రాగి పాత్రలో నైవేద్యంరాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని పురాణాలు చెబుతుంటాయి. ఇక శాస్త్రపరంగా చూస్తే, రాగికి రోగ నిరోధక శక్తి ఎక్కువ.

రాగి పాత్రలో నైవేద్యంతీర్థం రాగి పాత్ర ద్వారానే వేయడం వలన రోగాలు సోకకుండా ఉంటాయని అర్థం. అందుకే గడాకేశుడి శరీరం ద్వారా లోహాల లక్షణాలను తెలియజేశారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR