పితృ పక్షంలో ఏం దానం చేయాలో తెలుసా??

పదహారు రోజుల పితృ వేడుకలో, మన పెద్దలు లేదా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం ఆచారం. మత విశ్వాసం ప్రకారం, పూర్వీకుల ఆత్మల శాంతి కోసం పితృదేవుళ్ళ కోసం ఏడు వస్తువులను దానం చేయాలి. ఆత్మల సంతృప్తి కోసం శ్రద్ధా లేదా తర్పణ రోజున దానం చేయవలసిన ఏడు విషయాలు ఇక్కడ ఉన్నాయి.
పితృ దినోత్సవం రోజున మన పితృ దేవతల శాంతి కోసం దానం చేయవలసిన కొన్ని ఇప్పుడు చూద్దాం…

pitru masamమన పెద్ద వారికి తర్పణం వదిలిన రోజు ఇతరులకు నువ్వులను దైవభక్తితో దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోబడతామని పండితులు చెబుతున్నారు. అందుకోసమే తర్పణం వదిలే సమయంలో కూడా అన్నంలో నల్లనువ్వులను కలుపుతారు.

sesame seedsమన పెద్దలకు తర్పణం వదిలిన రోజు ఏ చిన్నపాటి వెండి వస్తువునైనా ఇతరులకు దానం చేయడం వల్ల మన పూర్వీకులకు ఆత్మశాంతి కలిగి వారి ఆశీస్సులు మనపై ఉంటాయి. వెండి చంద్రునికి సంబంధించినది కనుక శ్రాద్ధలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం కోసం వెండిని దానం చేయాలని చెబుతారు.

silverపితృ పక్షాల సమయంలో మన పూర్వీకులకు తర్పణం వదిలిన రోజు వస్త్రాలను దానం చేయడం ఎంతో శుభసూచకం. మన పూర్వీకుల పేరిట వస్త్ర దానం చేయడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు.

donate garmentsశ్రాద్ధ సమయంలో బెల్లం ఉప్పు దానం చేయటం వల్ల పూర్వీకులు సంతోషపడి మన ఇంటిలో ఏ విధమైనటువంటి కష్టాలు బాధలు లేకుండా తొలగిపోతాయి. అదేవిధంగా పితృ దోషాలు సైతం తొలగిపోయి ఎంతో సంతోషంగా గడుపుతాము. ఇలా కష్ట సమయాలలో వస్తువులను దానం చేయటం వల్ల కష్టాల సుడిగుండంలో నుంచి బయటపడతారని పండితులు తెలియజేస్తున్నారు.

jaggery and salt

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR