మామిడి తోరణాలు కట్టడం ఎప్పటి నుండి ఆచారంగా మారిందో తెలుసా ?

ఇంట్లో ఏదైనా శుభకార్యమో, పూజనో జరుగుతుంది అంటే ముందుగా లోగిళ్ళలో మామిడి తోరణాలు అందంగా అలంకరిస్తారు. ఇక పండుగల సంగతి చెప్పనవసరం లేదు .తోరణాలు కట్టిన ఇంటిని చూస్తే చాల కళగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు కడతారో చాల మందికి తెలియదు అది ఒక ఆచారం, అలవాటుగా మారిపోయింది . ఇలా తోరణాలు ఎప్పటి నుండి కడుతున్నారో తెలుసుకుందాం.

మామిడి తోరణాలుప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడి. జీవితంలో ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు అనేక ఇతర పురాణాలలో మామిడిమొక్కల ప్రస్తావన ఉంది.

మామిడి తోరణాలుమామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే. పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది.

మామిడి తోరణాలుమామిడి తోరణాలు శుభకార్యాలకు కడతారు. భగవంతుని పూజించేందుకు మామిడిని వాడతారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. దీనిని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాలలో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు.

మామిడి తోరణాలుక్రీ.పూ. 150 కాలం నాటి సాంచీ స్థూపంమీద మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కడం కనిపిస్తుంది. శిల్పకళతో పాటు అనేక ఇతర హస్తకళల్లో మామిడిరూపం కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR