పుష్కరాలెప్పుడు పుట్టాయి? ఎందుకు ప్రఖ్యాతమయ్యాయి తెలుసా ?

0
309

కృష్ణవేణి నర్మద గౌతమి/ గంగ పెన్న యలక తుంగభద్ర/ సహ్యతనయ యమున సప్తగోదావరీ/ తీరముల మునింగితిని వెలంది!… అంటూ రాసుకొచ్చాడు ‘సత్యభామాపరిణయము’ కృతికర్త. ఆయనొక్కడనేముంది, తెలుగువాళ్లందరూ తరతరాలుగా నదీస్నానం ఆచరిస్తున్న వాళ్లే. పుణ్యం కోసమని కొందరు… ఆరోగ్యం కోసమని మరికొందరు నదీజలాల్లో జలకమాడుతుంటారు! అలా అలా అదో ఆచారంగా స్థిరపడిపోయింది. ఇక పుష్కరాల సమయంలోనైతే నదీతీరాలన్నీ జనసంద్రాలవుతాయి.

Pushkaraluపుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. అన్నట్టు… ఈ పుష్కరాలెప్పుడు పుట్టాయి? ఎందుకు ప్రఖ్యాతమయ్యాయి? ఈ ప్రశ్నలకు మన పురాణ సాహిత్యం తనదైన శైలిలో సమాధానాలిస్తుంది.

Pushkaraluపూర్వ కాలంలో పుష్కరుడు అనే బ్రా హ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట.ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యేక్షమై ఏదైన వరం కోరుకోమని అడుగు తాడు. అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాల తో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమ య్యేట్లు వరం ఇవ్వమని కొరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవు తారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నా యి.

Pushkaraluబృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుం టారు. కాలగమనంలో నవ గ్రహాలు కాలపరిమితికి లోబడి వివిధ రాసుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్తజ్ఞ్రులు, పంచాంగ కర్తలు, వేద పండితులు చెబుతుంటారు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరం గా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్దతిలో పుష్కరాలను శాస్తజ్ఞ్రులు రూపొందించారు. అందులో భాగంగానే గురువు మేష రాశిలో ప్రవేశిస్తే గంగానదికి, వృషభ రాశిలో ప్రవేశి స్తే నర్మదా నది, మిథునంలో సరస్వతి, కర్కటంలో యము నానది, బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి, అలాగే మీనంలో గురువు వచ్చినప్పుడు ప్రాణహితా నదికి పుష్కరాలు వస్తాయి.

SHARE