పెరుగన్నంతో మామిడి పండు తింటే శరీరంలో ఎం జరుగుతుందో తెలుసా ?

మామిడిపండును ఇష్టపడని వారంటారా! తియ్యటి మామిడి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. అలాగే మామిడి కాయలను కోసి వాటిమీద కారం, ఉప్పు చల్లుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. పెరుగన్నంలో మామిడి పండు రసం కలుపుకుని తింటే ఆ మజానే వేరుగా వుంటుంది.

Curd Rice with Mangoఫలాల్లో రాజు అయిన మామిడికి నాలుగు వేల ఏళ్ల చరిత్ర వుంది. ఇది భారతదేశపు జాతీయఫలం. కేవలం వేసవిలోనే విరివిగా లభించే వీటిని తింటే శరీరానికి కెరోటిన్, విటమిన్ సి, కాల్షయం పుష్కలంగా లభిస్తాయి. అయితే మామిడిపళ్ళు ఎక్కువగా తింటే వేడి చేస్తుందని అంటారు.

Curd Rice with Mangoమన పెద్దవారు మామిడి పండ్లను పెరుగు అన్నంలో కలిపి తింటే మంచిదని చెప్పేవారు. దానిలో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో అందరికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. పనులు అన్నీ చేసుకుని తొందరగా పడుకునేవారు. ఎక్కువ శ్రమ పడేవారికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి పెరుగు అన్నంలో మామిడి పండు కలిపి తింటే శక్తి ఎక్కువగా వస్తుందని అలా తినేవారు.

Curd Rice with Mangoమామిడి పండులో విటమిన్ సి ఫైబర్,పెక్టిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. చర్మం లోపలి నుండి శుభ్రం చేసి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగు పరచడానికి సహాయపడి కళ్ళు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR