కురుక్షేత్రం తరువాత విష్ణువు మత్స్యవతారంలో వెలసిన ప్రాంతానికి పాండవులు ఎందుకు వెళ్లారు

0
5336

మహాభారతంలో పాండవులు వనవాస సమయంలో ఎన్నో ప్రదేశాలను తిరుగుతూ వెళ్లారు. అయితే దర్శం కోసం పోరాడిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సంహరించి ఆ తరువాత విష్ణమూర్తి అవతారాల్లో మొదటి అవతారం అయినా మత్స్యవతారంలో వెలసిన ఆ ప్రాంతానికి వెళ్లారు. మరి ఆ ప్రాంతానికి వారు ఎందుకు వెళ్లారు? ఆ ప్రదేశంలో వారికీ ఎలాంటి అనుభవం ఎదురైందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Pandavuluమహావిష్ణువు అవతారాలు మొత్తం పది. మహావిష్ణువు అవతారాల్లో మొదటి అవతారం మత్స్యవతారం. అయితే మత్స్యావతారం ఎత్తిన మహావిష్ణువు శంఖాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. మహావిష్ణువు లోహర్ గల్ అనే ప్రాంతంలో మత్య్సవతారంలో వెలిసాడు. అయితే శంఖాసురుడి సంహరణ తరువాత అక్కడే తన అవతారాన్ని చాలించాడు.

Pandavuluమహాభారతయుద్ధం తరువాత పాండవులు యుద్ధంలో చేసిన తప్పులను పోగొట్టుకోవడానికి లోహర్ గల్ కి వెళ్లి అక్కడ సరస్సులో పుణ్యస్నానం చేస్తారు. మొదటగా ధర్మరాజు స్నానం చేయగా, అనంతరం అర్జునుడు స్నానం చేస్తాడు. ఆ తరువాత నకల సహదేవులు స్నానం చేస్తారు. అయితే, అలా స్నానం చేసే సమయంలో వారి ఒంటిమీదున్న ఆయుధాలు నీళ్ళల్లో కరిగిపోతాయి. శరీరం మొత్తం రక్తమయం అవుతుంది.

Pandavuluవీరిని చూసి భీముడు మొదట భయపడతాడట. సోదరులకు జరిగిన అన్యాయానికి కోపోద్రిక్తుడై లోహర్ గల్ సరస్సును తన గదతో మోదాలని చూస్తాడు. కానీ, ధర్మరాజు వారించి, చేసిన తప్పులకు పరిహారం జరిగే సమయంలో అలాగే జరుగుతుందని నచ్చచెప్పి భీముడిని కూడా సరస్సులో స్నానం చేయిస్తారు. దీంతో భీముడి ఆయుధాలు కూడా ఆ సరస్సులో కరిగిపోతాయి. శరీరం రక్తంతో తడిచిపోతుంది. అక్కడి నుంచి పాండవులు కైలాసం వెళ్లారని ఒక పురాణ గాథ.

SHARE