ఏ బ్లడ్ గ్రూప్ వారికి డయాబెటిస్ ఎక్కువగా వస్తుంది?

మనకు వచ్చే జబ్బులు కేవలం మనజీవనశైలి, ఆహారపు అలవాట్ల మీదనే ఆధారపడి ఉండదు. మన బ్లడ్ గ్రూప్ వల్ల కూడా వొస్తాయీ అని మీకు తెలుసా? ప్రపంచాన్ని కలవరపెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్, హార్ట్ టాక్ లు ముందు స్తానంలో ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడవుతుంది.

most prone blood group for diabetesడయాబెటిస్ అనేది జీవితకాలం కొనసాగుతునే ఉండే వ్యాధి.. అందుకే దీనికి జీవితాంతం నియంత్రణ పాటిస్తూనే ఉండాలి. డయాబెటిస్ లేని వ్యక్తులకు దానిని రాకుండా చేయడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ముఖ్యమని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. అయితే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువో? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి తక్కువో? ఇప్పుడు తెలుసుకుందాం!

most prone blood group for diabetesబ్లడ్ గ్రూప్ లోని నాలుగు రకాల్లో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చితే నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వక్యులకు డయబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఒక అధ్యయనం ప్రకారం O బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళలతో పోలిస్తే.. A బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 10 శాతం ఎక్కువ ఉన్నట్లు తేలింది.

most prone blood group for diabetesఅయితే B బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల O గ్రూప్ ఉన్నవారి కంటే 21 శాతం ఎక్కువగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. O బ్లడ్ గ్రూప్ తో పోలీస్తే.. బి బ్లడ్ గ్రూప్ ఉన్న స్త్రీలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది.

బి బ్లడ్ గ్రూప్ వారికి ఎందుకు ఎక్కువగా వస్తుంది?

most prone blood group for diabetesఇప్పటికీ బి బ్లడ్ గ్రూప్ వారికి డయాబెటిస్ ఎక్కువగా వస్తుందనే దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ కొన్ని అద్యయానాల ప్రకారం నాన్ విల్లెబ్రాండ్ కారకం అని పిలువబడే రక్తంలో ఒక ప్రోటీన్ నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వారిలో ఎక్కువగా ఉంటుందని.. ఇది రక్తంలో చక్కెర స్తాయిలను పెంచుతుందని వెల్లడైంది. అందుకే వీరిలో ఎక్కువగా డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నట్లుగా పరిశోధకులు తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారు వారి శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. అలాగే అందుకు సంబంధించిన చికిత్స తీసుకోవడం ఉత్తమమంటున్నారు నిపుణులు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR