ఏ చేపలు తింటే మంచిది ? దానివలన ఉపయోగాలు ఏంటి ?

చేపలు మానవ శరీరానికి ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్‌ డి ఎముకల పెరుగుదలకు కీలకం.

చిన్న చేపలుఅప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే.. తరుచూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చేపలు ఎక్కువగా తినేవారిలో లావు పొట్ట, అధిక రక్తపోటు వంటివి రావటం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైంది.

చిన్న చేపలుఅయితే ఏ చేపలు తింటే మంచిది అంటే మంచిది అనే ప్రశ్నకు సమాధానాలు తెలుసుకుందాం. ఏ చేపలయినా వారానికి ఓసారి తిన్నా మంచిదే అంటున్నారు వైద్యులు, మరీ ముఖ్యంగా బాగా పెరిగిన… కొవ్వుపట్టి ఉన్న చేపల్ని వారానికి నాలుగుసార్లు తింటే వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు గుండె జబ్బులు రాకుండా ఆపుతుందట.

చేపలుఅయితే మనకు చెరువుల్లో ఉండే పెద్దచేపల్లోహై డెన్సిటీ లైపోప్రోటీన్ .. పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ ను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి. ఇలాంటివి తింటే ఏదైనా గుండె జబ్బు సమస్యలు ఉన్నా తగ్గుతాయి.

చేపలుచిన్న చేపలు కంటే పెద్ద చేపలు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్ధాయి బాగా పెరుగుతుంది. పెద్ద చేపలు కాస్త రేటు ఉన్నా అవే కొని తినండి అంటున్నారు వైద్యులు..HDL తక్కువ ఉన్న చేపలు తింటే ఏ ఉపయోగం ఉండదు అంటున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR