Home Unknown facts దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి? ఎలా చేయాలి

దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలి? ఎలా చేయాలి

0

హిందువులు దేవుడి విగ్ర‌హం లేదా చిత్ర‌ప‌టానికి ధూప‌దీప నైవేద్యాలు స‌మ‌ర్పించి దైవాన్ని ఆరాధిస్తుంటారు. అందులో భాగంగా దీపాన్ని కూడా వెలిగిస్తారు. దీపంతో మ‌న‌లో దాగి ఉన్న దైవీక శ‌క్తులు మేల్కొల్ప‌బ‌డ‌తాయి. శారీర‌క‌, మాన‌సిక బ‌లం క‌లుగుతుంది. దీనికి తోడు దీపం వెలిగించి మ‌నం దైవాన్ని ప్రార్థిస్తే కోరిన కోర్కెల‌న్నీ నెర‌వేరుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.

Deeparadhanaదీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించుకునుటకు మంచిది.

విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపం, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము. అయితే దీపాన్ని క్రింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు,లేదా ఎదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాదన చేయాలి.

 

Exit mobile version