ఏ చర్మం వాళ్ళు ఎటువంటి ఫేస్ వాష్ ఉపయోగిస్తే మంచిది ?

ఆడవారికి చర్మ సంరక్షణ అనేది ఒక పెద్ద సవాలు లాంటింది. సీజన్లో వచ్చే మార్పులను తట్టుకొని చర్మం అందంగా కనిపించాలంటే అంత సులభం కాదు. అందులోనూ వయసు పెరుగుతున్న వారిలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా బయటకు వెళ్లే వారి ముఖం కలుషితమైన గాలి, దుమ్ము, ధూళి మరియు సూర్యుడి హానికరమైన కిరణాలకు ప్రతిరోజూ బహిర్గతమవుతుంది. రోజంతా ముఖం మీద పేరుకుపోయే అన్ని మలినాలను వదిలించుకోవడానికి రోజుకు చాలాసార్లు ముఖం కడుక్కోవడం చాలా అవసరం. అయితే అలాంటివారు ముఖాన్ని కేవలం నీటితో కడిగితే సరిపోదు. ముఖాన్ని సరిగ్గా శుభ్రపరచడానికి మరియు ధూళిని తొలగించడానికి ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది.

Which skin should they use which face wash?ఫేస్ వాష్ తో ముఖం కడగడం ముఖం లోతుగా శుభ్రపరచడానికి సహాయపడుతుంది. సులువుగా అది చర్మంపై ఉండే మట్టి మొదలైన వాటిని తొలగిస్తుంది. మొటిమలు, నల్ల మచ్చలను నివారించడంలో కూడా ఇది చాలా ముఖ్యం. ఫేస్ వాష్ తో మీ ముఖాన్ని కడిగినప్పుడు, చర్మాన్ని పూర్తిగా మసాజ్ చేయడం ద్వారా చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఫేస్ వాష్ మీ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది మీ ముఖానికి సహజమైన గ్లో ఇస్తుంది.

Which skin should they use which face wash?ఫేస్ వాష్ తో చర్మాన్ని శుభ్రపరచడం వల్ల చర్మం యొక్క అన్ని పొరలను తొలగించవచ్చు. ఇది చర్మానికి సరైన ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుంది. మీ చర్మానికి అవసరమైన ఆక్సిజన్ మరియు తేమ వచ్చినప్పుడు, చర్మం యవ్వనంగా మరియు అందంగా ఉంటుంది. ఫేస్ వాష్ తో రోజూ మీ ముఖం కడుక్కోవడం కూడా ముడతలు మరియు వృద్ధాప్య లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

Which skin should they use which face wash?అయితే ఎవరు ముఖానికి ఎటువంటి ఫేస్ వాష్ ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఏ చర్మం వాళ్ళు ఎటువంటి ఫేస్ వాష్ ఉపయోగిస్తున్నారు అనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చర్మ తత్వాన్ని బట్టి ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలి. ముఖ్యంగా చాలా మంది వివిధ రకాల ఫేస్ వాష్ లను ట్రై చేస్తూ ఉంటారు. కానీ దాని వల్ల తెలియకుండానే ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకని చర్మాన్ని బట్టి ప్రొడక్ట్స్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి. మీ చర్మ తత్వం ఏంటి? దానికి ఎలాంటి ఎటువంటి ఫేస్ వాష్ ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం.

డెర్మటాలజిస్ట్ సూచనల ప్రకారం చర్మాన్ని ముఖ్యంగా డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని మూడు రకాలుగా విభజించడం జరిగింది.

డ్రై స్కిన్ :

Which skin should they use which face wash?డ్రై స్కిన్ వాళ్లకి చర్మం ఎర్రగా, ఇరిటేషన్ గా ఉండడం సహజం. అయితే అటువంటి వాళ్ళు తక్కువ నురగ వచ్చేది మరియు మిల్కీ టెక్చర్ తో కూడినది ఎంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి ఇవే పడతాయి. అలానే వాడే ఫేస్ వాష్ లో తప్పకుండా అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల చర్మం తేమగా ఉంటుంది. అలాగే ప్రతి రోజు రెండు సార్లు ఫేస్ వాష్ తో ఫేస్ ని శుభ్రం చేసుకోండి. ప్రతి రోజూ ఉదయం మీరు నిద్ర లేవ గానే ఫేస్ వాష్ తో మీ ఫేస్ ని శుభ్రంగా ఉంచడం. అలానే రాత్రి మీరు నిద్ర పోయేటప్పుడు కూడా మీ ఫేస్ ని ఫేస్ వాష్ తో శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం కనబడుతుంది.

ఆయిల్ స్కిన్ :

జిడ్డు చర్మం ఉన్న వాళ్ళ బాధ అంతా ఇంతా కాదు. ఎంత ఫేస్ వాష్ ని వాడిన ఎంత సేపు మేకప్ వేసినా ఫలితం ఉండదు. పైగా ఎప్పుడు చూసినా జిడ్డు అలా కారిపోతూ ఉంటుంది. ఆ జిడ్డు కంట్రోల్ చేయడానికి కూడా కష్టం. చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చర్మం కూడా కాంతివంతంగా జిడ్డు లేకుండా ఉంటుంది. మరి జిడ్డు చర్మం ఉన్న వాళ్లు ఎటువంటి ఫేస్ వాష్ ని ఉపయోగించాలి..?అంటే ఫేస్ వాష్ ని ఎంచుకునేటప్పుడు ఫోమ్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. అలాగే ఫేస్ వాష్ లో తప్పకుండా క్లియర్, జెంటిల్, జెల్ ఇలాంటివి ఉండేటట్లు చూసుకోండి.

Which skin should they use which face wash?సాధారణంగా డ్రై స్కిన్ లేదా కాంబినేషన్ స్కిన్ ఉన్న వారు రోజుకు రెండు సార్లు చేసుకుంటే సరి పోతుంది. కానీ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళ కి ఇలా చేస్తే కుదరదు. ఎందుకంటే వాళ్లు డబల్ క్లెన్సింగ్ చాలా అవసరం. తప్పకుండా డబల్ క్లెన్సింగ్ పద్ధతిని పాటించాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు రాత్రి నిద్ర పోయేటప్పుడు రెండు సార్లు ముఖాన్ని కడుక్కోవాలి మొదట ఒక సారి కడిగిన తర్వాత మరో సారి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఎక్కువ జిడ్డు ఉండదు పైగా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఇలా కనుక ఈ పద్ధతిని అనుసరించారు అంటే తప్పకుండా మీరు మరింత అందంగా ఉండొచ్చు.

కాంబినేషన్ స్కిన్ :

Which skin should they use which face wash?ఒకవేళ కాంబినేషన్ స్కిన్ ఉంది అంటే మీకు టీ జోన్ ఉన్నట్టు. అంటే నుదిటి మీద మరియు ముక్కు మీద ఆయిలీగా ఉండటం మరియు మీ చీక్స్ మీద డ్రై గా ఉండటం జరుగుతుంది. దానినే కాంబినేషన్ స్కిన్ అంటారు. ఈ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్లు క్లియర్, జెంటిల్ మరియు నురగ తో కూడిన ఫేస్ వాష్ ను ఉపయోగించడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అలానే మైల్డ్ కెమికల్ ఎక్సఫ్లోషన్ ఉన్న వాటిని ఉపయోగించాలి. అంటే ఏ హెచ్ మరియు బీ హెచ్ లాంటి వాటిని తీసుకోండి. అలానే సిరమిడ్స్, పెప్టిడ్స్ ఉన్న వాటిని తీసుకోవడం వల్ల చర్మం మరింత బాగుంటుంది. దానితో పాటు డ్రై స్కిన్ వాళ్ళ లాగ రెండు సార్లు ముఖాన్ని కడుక్కోవాలి. ఉదయం నిద్రలేవ గానే ఒకసారి ఫేస్ వాష్ తో ఫేస్ క్లీన్ చేసుకోవడం. అలాగే రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా మరొక సారి ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవడం చేయండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR