చిరుతిళ్ళలో ఏవి ఎక్కువగా తినొచ్చు, ఏవి తినకూడదు?

డైట్ పాటించేవాళ్ళు అన్నం, చపాతీ కి బదులు లైట్ ఫుడ్, చిరుతిళ్ళు తింటూ ఉంటారు. అయితే చిరుతిళ్లు తినడానికి ఎంత బావుంటాయో, అంత ప్రమాదం కూడా. తినే చిరు తిళ్ళు సరైనవి కాకపోతే, ఆరోగ్యం దెబ్బతినడమే  కాదు… డైట్  కూడా అదుపు తప్పుతుంది. పైగా స్నాక్స్‌లో ఉప్పు అధికంగా  ఉంటుంది. అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే స్నాక్స్ తీసుకునే టప్పుడు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి.
ఆకలి వేస్తోందని ఏది పడితే అది తినరాదు. పద్ధతైన సరైన చిరుతిళ్ళు ఎంచుకుంటే , డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదు. ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు వంటి పాశ్చాత్య ఆహార పదార్థాలు మాత్రమె కాకుండా, భారతదేశంలో రోజు తినే కొన్ని చిరుతిళ్ళు కూడా అనారోగ్యాలకు గురి చేస్తున్నాయి. పాశ్చాత్య ఆహార పదార్థాలు మాత్రమె ఆరోగ్యం పాడవుతుందని కొంత మంది అపోహ. అది నిజం కాదు.
చిరుతిళ్ళు ఎంచుకునేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అలాగే అవగాహన కూడా ఉండాలి. డార్క్ చాకొలెట్లలో మిల్క్ ,షుగర్, ఎక్కువగా ఉంటాయని  చాలా మంది వాటికి దూరం గా ఉంటారు. కానీ డార్క్ చాక్లెట్ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. 70 శాతం డార్క్ చాకొలెట్లు ఒక్కొక్కటీ 150 కేలరీల శక్తిని  ఇవ్వడమే కాదు… వాటిలో యాంటీ-ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి.
కాబట్టి స్వీట్లు, పిజ్జాలు  వంటివి తినే బదులు డార్క్ చాకొలెట్లు తినడం మంచిది. నవధాన్యాలూ, తృణధాన్యాలు మనకు ఎంతో మంచివి. అవి  ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వలన త్వరగా ఆకలి వెయ్యకుండాచేస్తాయి. వీటిని డ్రింక్స్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు. సాల్ట్ చిప్స్ తినే బదులు వీటిని తినడం ఎంతోమంచిది. ఓ గుప్పెడు ధాన్యం ఇంచుమించుగా 100 కేలరీలశక్తిని ఇస్తాయి. ఆ రోజుకు కావాల్సిన ఫైబర్ మొత్తం లభించినట్టవుతుంది.
గుడ్లను ఉడక బెట్టి తినడం తేలిక. ఇవి శరీరానికి కావలిసిన సరైన ఫ్యాట్స్ ,ప్రోటీన్లు, ఇస్తాయి. కొన్ని కార్పొహైడ్రేట్స్ కూడా పొందవచ్చు. లావుగా ఉన్న వారు గుడ్లను స్నాక్స్‌గా తీసుకోవాలంటే వాటిలోని పసుపు సొనని  తీసేసి తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పచ్చిబఠానీలు తినడం గుండెకు చాలా మంచిది. వీటి లోని ఫైబర్, స్టెరాల్స్, సిటోస్టెరాల్ వంటివి శరీరం లో కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. కాబట్టి సాయంత్రం చిరు తిండిగా  వీటిని వేయించుకుని తినడం వలన కారంగా రుచిగా ఉంటాయి.
ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని అందించే చిరుతిళ్ళ గురించి తెలుసుకున్నాం… ఇప్పుడు అనారోగ్యాలకు గురి చేసే చిరుతిళ్ళ గురించి తెలుసుకుందాం…ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు వంటి మాత్రమె కాకుండా, పండగల సమయంలో తినే స్వీట్లు, సాయంత్రం సమయంలో తినే స్నాక్స్, వంటి వాటి వలన అనారోగ్యాలకు గురవుతున్నాము.
సమాజంలో వర్గంతో, కులంతో సంబంధం మరియు లింగభేదం లేకుండా, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క బలహీనతగా పానీ పూరిని చెప్పవచ్చు. ఈ బలహీనత వలన భవిష్యత్తులో, ఆరోగ్యాన్ని కుదుటపరచుకోటానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. నూనెలో వేయించిన చిన్న చిన్న పూరీలు, వీటిలో కలిపే చట్నీ వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా మలబద్దకానికి దారి తీస్తుంది.
సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా టీతో పాటూ, పకోడి వంటివి తినటానికి ఇష్టపడుతుంటారు. ఈ పకోడిలను కూడా వివిధ రకాలుగా తయారు చేసుకుంటాము, ఉదాహరణకు- ఉల్లిపాయ, కరివేపాకు, పాలకూర, మిర్చి.. చాలా రకాల పకోడి రకాలను తయారు చేసుకోవచ్చు. నూనెలో వేయించబడిన స్నాక్స్ వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గి, చెడు కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి.
సమోసా… పుట్టినరోజు పార్టీ, ఆఫీస్’లో సాయంత్రం సమయంలో స్నాక్స్’గా లేదా ఇంట్లో బంధువులు వచ్చినపుడు, ఈ రకం చిరుతిళ్ళకు ప్రాధాన్యత ఇస్తుంటాము, నూనెలో వేయించటం వలన ఒక్కొక్క సమోసాలో, కనీసం 25గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి.
ఇక కచోరీ తినటం వలన అసిడిటీ, స్థూలకాయత్వం, కరోనరీ డిసిజేస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలుగుతాయి. పిల్లలు, మధ్యాన్న భోజనంగా ఒక జంట బంగాళదుంప కట్లెట్ ప్యాక్’లను తినటానికి మక్కువ చూపుతుంటారు. కానీ, ఇలా ప్యాక్ చేసిన కట్లెట్ వలన పిల్లల శరీరంలో అనవసర పిండి పదార్థాలు మరియు కార్బోహైడ్రేట్ల స్థాయిలు పెరిగిపోతాయి.
పాలు మరియు జిలేబీ కలయిక అనేక సంస్కృతులలో ప్రాచుర్యం పొందింది. కానీ ఈ స్వీట్లు ఆరోగ్యాన్ని ఎంతోగానో దెబ్బతీస్తాయి. జిలేబీని నూనెలో వేయించి, ఆపై చక్కెర పానకంలో నానబెట్టడతారు. వీటిని తినటం వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు గణనీయంగా పెరిగిపోతాయి.
దక్షిణ భారతదేశానికి చెందిన వడని తినటానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. వడ తినటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ, ఇది ఒక అపోహ మాత్రమె. నిజానికి వడను చాలా సమయం పాటూ నూనెలో వేయించి తీస్తారు. కావున ఇది ఆరోగ్యానికి హానికరమే.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR