ద్రౌపది కాకుండా పాండవుల మిగతా భార్యలు, వాళ్ళ పిల్లలు ఎవరో తెలుసా?

జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలంటే మహాభారతాన్ని చూడాల్సిందే. ఆ మహా కావ్యంలో ఎన్నో వింతలు, విశేషాలు, విషయాలు. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకు అందులో సమాధానం దొరుకుతుంది. అలాంటి మహా కావ్యాన్ని ఎంత తెలుసుకున్న ఇంకా ఎన్నో తెలియని విషయాలు ఉండనే ఉంటాయి.

అయితే భారతంలో ప్రధానపాత్రలయిన పంచపాండవులకు అనేక విశేషాలు ఉన్నాయి. వారందరూ కలసి ఒకే భార్య ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. కానీ వారికి ద్రౌపదే కాక మరికొందరు భార్యలు కూడా ఉన్నారు. వారెవరు వారి పేర్లు అంటే చాలామందికి తెలియదు. ఆ పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

Dharma Rajuధర్మ రాజు భార్య- దేవిక, వారిరువురికి కలిగిన సంతానం యౌధేయుడు.

భీముడి భార్యలు- జలంధర, హిడింబ. భీముడికి,జలంధరకి కలిగిన సంతానం సర్వగుడు, భీముడికి హిడింబకి పుట్టిన కొడుకు ఘటోత్కచుడు.

భీముడిఅర్జునుని భార్యలు- సుభద్ర, ఉలూచి, చిత్రాంగి. అర్జునుడు, సుభద్రల పుత్రుడు అభిమన్యుడు. అర్జునుడు,ఉలూచికి.. ఇరావంతుడు అనే కొడుకు జన్మించాడు.అర్జునుడికి చిత్రాంగికి కలిగిన సంతానం బభ్రువాహనుడు.

Arjunuduనకులుడి భార్య- రేణుమతి, వీరి కుమారుడు నిరమిత్రుడు.

Nakuluduసహదేవుని భార్య- విజయ, వీరిద్దరి కొడుకు సుహోత్రుడు.

Sahadevaపాండవులకు ద్రౌపది వల్ల కలిగిన పుత్రులు

  • ధర్మరాజు – ప్రతివింద్యుడు
  • భీముడు- శృతసోముడు
  • అర్జునుడు – శృతకీర్త
  • నకులుడు – శతానీకుడు
  • సహదేవుడు- శృతసేనుడు

కురువంశ మూలపురుషుడు శంతనుడి భార్యలు – గంగ; సత్యవతి. శంతనుడుకి గంగాదేవికి పుట్టిన సంతానమే భీష్ముడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR