సూర్యుని రెండవ భార్య ఛాయా మరి మొదటి భార్య ఎవరు ?

బ్రహ్మ మానస పుత్రుడైన కశ్యప్రజాపతికి, దక్షుని కూతురైన అదితికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు. అతడే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయిన సంజ్ఞనిచ్చి వివాహం చేశాడు. అయితే ఆమె సూర్యుని ఉగ్రతేజాన్ని సహించలేకపోతుంది.

సూర్య భగవానుడి భార్య ఎవరుసూర్యునికి, ఆమెకు మొదట వైవస్వతడు (మనువు), తరువాత శ్రాద్ధదేవుడు, ఆ పిమ్మట యముడు-యమున అనే కవలపిల్లలు జన్మిస్తారు. ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా సూర్యునికి అతని భార్యమీద మోహం తగ్గలేదు. ఆ విషయాన్ని గమనించిన సంజ్ఞాదేవి తననుండి ఛాయ అనే దానిని సృష్టించి, ‘‘నేను నా పుట్టింటికి వెళుతున్నాను. నువ్వు కూడా నా రూపమే కనుక నా స్థానంలో వుండి నా భర్తను సంతోషపెట్టు. నువ్వు ఛాయవని తెలియకుండా చూసుకో’’ అని చెప్పింది. ఆమె తప్పనిసరి పరిస్థితులలోగాని చెప్పను అని మాటిస్తుంది.

సూర్య భగవానుడి భార్య ఎవరుసంజ్ఞ తన తండ్రి ఇంటికి చేరుకోగా తండ్రి ఆమెను మందలిస్తాడు. ఎలాంటివాడైనా భర్తను వదిలి సాధ్వియైన ఇల్లాలు వుండకూడదు అని బుద్ధిచెప్పి తిరిగి వెనక్కు పంపిస్తాడు. అయితే ఆమె భర్త దగ్గరికి వెళ్లకుండా ఒక ఆడగుర్రమై పచ్చియబయళ్లలో మేస్తూ కాలాన్ని గడుపుతుంటుంది.

సూర్య భగవానుడి భార్య ఎవరుఛాయను సూర్యుడు తన భార్యే అనుకుని తనతో కాపురం చేస్తాడు. దాంతో వీరిద్దరికి సావర్ణుడు, శనేశ్వరుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు. ఛాయకు క్రమక్రమంగా సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతుంటుంది. ఒకరోజు ఛాయ, తనతో ప్రవర్తించిన తీరుకు యముడు కోపగించుకుని ఆమెను తన్నడానికి కాలెత్తుతాడు. ఛాయ కూడా కోపంతో నీ కాలు విరిగిపోవుగాక అని శపిస్తుంది. అప్పుడు యముడు తండ్రి అయిన సూర్యుడు దగ్గరకు వెళ్లి, తల్లి తనకిచ్చిన శాపం గురించి వివరిస్తాడు. సూర్యుడు అతనిని ఓదార్చి నాయనా… నువ్వు సత్యవంతుడివి, ధర్మాన్ని తప్పవు. అటువంటి నీకే కోపమొచ్చే విధంగా చేసిందంటే ఆమె ఎంత అనుచితంగా ప్రవర్తించిందో నేను గ్రహించగలను. తల్లి శాపాన్ని తిప్పటం నా వశం కాదు. కాని నీ ధర్మప్రవర్తన వల్ల నువ్వు ఆ శాపం నువ్వు విముక్తి పొందుతావు అని అంటాడు.

సూర్య భగవానుడి భార్య ఎవరుతరువాత ఛాయను చూసిన సూర్యుడు నువ్వు నీ పిల్లల మీద ఇంత బేధబుద్ధి చూపడానికి కారణమేంటి? అని ప్రశ్నిస్తాడు. అయితే ఆమె సమాధానం చెప్పకుండా వుంటుంది. సూర్యుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకుని శపించడానికి సిద్ధమవుతుండగా ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంజ్ఞకు తాను ఛాయ అని తప్పు ఒప్పుకుని, మన్నించమని వేడుకుంటుంది

సూర్య భగవానుడి భార్య ఎవరుసూర్యుడు ఆమెను వదిలి ఆవేశంతో తన మామగారి ఇంటికి వెళతాడు. త్వష్ట అతనిని శాంతపరిచి, తన కుమార్తెను అప్పుడే బుద్ధిచెప్పి పంపించాను అని చెబుతాడు. ఇంకా కోపంతో మండుతున్న సూర్యుడితో మామ ఈ విధంగా చెబుతాడు అల్లుడా..ఒక మాట చెబుతాను విను. నీ తేజస్సు మాలాంటి వారికే ఎంతో ఇబ్బందిగా వుంది. ఒక స్త్రీ, అందులో సుకుమారి ఎలా భరిస్తుంది? అందుకే నీ తేజాన్ని తగ్గించుకో. దీనిని అంగీకరించు అని అనగా సూర్యుడు దానిని ఆమోదిస్తాడు. అప్పుడు త్వష్ట సూర్యుని సానరాతి మీద అరుగదీస్తాడు. అలా అరుగుతీయడం వల్ల సూర్యుని తేజస్సు తగ్గడమేమోగానీ ఆ మెరుపుతో ఇంకా ప్రకాశవంతుడయ్యాడు. త్వష్ట, సూర్యుడిని అరుగుతీసినప్పుడు రాలిన తేజ కణాలతో విష్ణుదేవుడికి చక్రం చేసి ఇచ్చాడు.

సూర్య భగవానుడి భార్య ఎవరుఆ తరువాత సూర్యుడు సంజ్ఞను వెదకడానికి అరణ్యానికి బయలుదేరుతాడు. అక్కడ పచ్చికమేస్తున్న ఆడ గుర్ర రూపంలో ఉన్నది తన భార్యే అని గుర్తుపట్టి తను కూడా మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడతాడు. అయితే ఆమె, తనను బలాత్కరించడానికి వచ్చిన మగగుర్రం అని భావించి, సూర్యుని తేజస్సును ముక్కనుండి బయటకు విసర్జిస్తుంది. అది రెండుచోట్ల పడగా దాని నుండి అశ్వనీదేవతలు పుట్టారు. వారే తధాస్తు దేవతలుగా పిలువబడ్డారు. సూర్యుడు తన నిజస్వరూపాన్ని సంజ్ఞకు చూపించాడు. సూర్యుని సంతానమైన వైవస్వతుడు మానవుడు అయ్యాడు. శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అయ్యాడు. యముడు దక్షిణ దిక్పాలకుడయ్యాడు. సూర్యసావర్ణుడు కూడా మనువు అయ్యాడు. శనైశ్చరుడు గ్రహాలలో ఒక్కడయ్యాడు. యమున భూలోకంలో నదిగా ప్రవహిస్తున్నది.

సూర్య భగవానుడి భార్య ఎవరుఎవరైనా ఈ సూర్యచరిత్రను విన్నా, పఠించినా వారు ఆపదలనుండి విముక్తులై ఆరోగ్య సంపదలను పొందుతారు అని శాస్త్రం చెబుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR