Home Unknown facts జ్యేష్ఠమాసంలో ఎవరు వివాహం చేసుకోవాలి ? ఎవరు చేసుకోకూడదు?

జ్యేష్ఠమాసంలో ఎవరు వివాహం చేసుకోవాలి ? ఎవరు చేసుకోకూడదు?

0

సాధారణంగా చాలామంది ఏ మాసంలో వివాహాలు చేసుకుంటే మంచిదనే సందేహాల్లో పడిపోతారు. అటువంటి సమయాల్లో జ్యోతిష్య నిపుణుల దగ్గర సలహాలు తీసుకోవడం చాలా మంచిది. వారి సలహాలమేరకే ఇక్కడ కొన్ని మాసాల గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో ఎవరు వివాహం చేసుకోవాలి..? ఎవరు చేసుకోకూడదు?

జ్యేష్ఠమాసం :

Vishnu Murthyహిందూ సంస్కృతీ – సంప్రదాయం ప్రకారం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ సంతానం వివాహం చేయకూడదని పూర్వకాలం నుంచి మన ఆచారులు చెబుతున్నారు. అయితే మొదట ఇక్కడ జ్యేష్ఠ సంతానం గురించి తెలుసుకోవాల్సి వుంది. జ్యేష్ఠ సంతానం అంటే దంపతులకు మొదటిసారిగా పుట్టిన పుత్రుడుకానీ, పుత్రికకానీ జ్యేష్ఠ సంతానాలుగా పరిగణించబడతారు. ఇందులో జ్యేష్ఠం అనే పదం గర్భానికి సంబంధించింది. ఒకవేళ గర్భస్రావమయి కూడా ప్రథమ సంతానం జీవించి వుండకపోతే ఆ తరువాత జన్మించే సంతానం జ్యేష్ఠ సంతానం కిందకే వస్తారు.

ఇక వివాహ విషయానికి వస్తే మన పురాణగ్రంథాల ప్రకారం జ్యేష్ఠమాసంలో ఎటువంటి పరిస్థితులోనైనా జ్యేష్ఠ సంతానానికి వివాహ కార్యక్రమాలను నిర్వహించకూడదు. కేవలం వివాహ కార్యక్రమాలనే కాదు ,ఏ శుభకార్యాలలోనూ కూడా వాళ్లను ఆహ్వానించకూడదు. అలాగే మార్గశిర మాసం కూడా జ్యేష్ఠ సంతానికి అంత శ్రేయస్కరం కాదు. యజ్ఞోపవీతం, వివాహం, కేశఖండన వంటి శుభకార్యాలు జ్యేష్ఠ సంతానానికి చెందిన వ్యక్తులు వారు జన్మించిన మాసంలో అస్సలు జరపకూడదు. అలా కాని పక్షంలో వారికి అరిష్టాలే ఎదురవుతాయి.

భరద్వాజ మహర్షి సూచనల ప్రకారం జ్యేష్ఠ మాసంలో కృతికా నక్షత్రంలో సూర్యుడు వుండే పదిరోజులు మినహాయించి మిగతారోజుల్లో శుభకార్యాలు చేసుకోవచ్చు. వరుడు, వధువు ఇద్దరూ జ్యేష్ఠ సంతానమే అయితే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం ఎన్నటికీ చేయకూడదు. ఒకవేళ వధూవరులలో ఒకరే జ్యేష్ఠులు అయితే అటువంటివారు వివాహం చేసుకోవచ్చు.

ఆషాడమాసం :

హిందువుల సంస్కృతి సంప్రదాయాలు ప్రకారం ఆషాఢమాసంలో వివాహాలుగానీ, ఇతర శుభకార్యాలుగానీ నిర్వహించుకోకూడదు. ఎందుకంటే ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని మన పూర్వీకులు పేర్కొన్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలిఏకాదశి అని అంటారు. ముఖ్యంగా ఇది విష్ణువు ఆరాధులకు ఎంతో ప్రముఖమైన రోజు. ఈ తొలిఏకాదశి నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభం అవుతుంది. అలాగే పండుగలు కూడా మొదలవుతాయి.

తెలంగాణాలో బోనాల పండుగ, పూరిజగన్నాథుడి రథయాత్రం వంటి పండగలు ఈ మాసంలోనే జరుగుతాయి. అలాగే సకల జీవులకు ఆహారం అందించే ‘‘ఆదిశక్తి’’ని శాకంబరీదేవిగా కొలుస్తారు. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను తమ పుట్టింటికి తీసుకునివెళ్తారు. అంటే ఈ మాసం మొత్తం భార్యాభర్తలు దూరంగా వుండాల్సిందే. పురాతనకాలం నుంచి ఈ మాసంలో ఆడవాళ్లు తమ చేతులకు గోరింటాకు వేసుకోవడం ఒక ఆచారంగా వస్తోంది.

 

Exit mobile version