రాముడు కంటే ముందు రావణుడిని ఓడించిన రాజు ఎవరో తెలుసా ?

దశకంఠుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనేదానికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

మంధాతరావణాసురుని దుర్మార్గత్వాన్ని, గొప్పతనాన్ని, శౌర్యాన్ని, దానగుణాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండ 32వ సర్గలో వర్ణిస్తాడు. రావణాసురుడు కొలువు తీరి రెండవ ఇంద్రుడు లాగా ఉన్నాడు. నోరు తెరుచుకొని ఉన్న ఈ రావణాసురుని చూస్తే రెండో యముడు లా ఉన్నాడు. తెల్లని పట్టు పుట్టం కట్టుకొని ఉన్న ఈ రావణాసురుడికి ఇరవై బాహువులతో, పది తలలతో, విశాల వక్షం కలిగి, వాని ఛాతీపై వజ్రాయుధపు వాతలు, ఐరావతం దంతాలతో కుమ్మిన గుర్తులు, సుదర్శన చక్రపు గాటులు ఉన్నాయి.

మంధాతలంకను జయించిన తరువాత రావణుడు మనోహరమైన కైలాసపర్వతాన్ని చూశాడు. తన బలనిరూపణకై దాన్ని పెకలించడానికి ప్రయత్నించాడు. దశకంఠుని గర్వానికి కోపించిన శివుడు తన కాలి చిటికెన వేలితో కైలాస పర్వతాన్ని నొక్కి, దాని కింద రావణున్ని అణగదొక్కాడు. అప్పుడు రావణుడు అతి బిగ్గరగా చేసిన ఆర్తనాదం వల్లనే అతనికి రావణుడు అనే పేరు వచ్చింది. భయంకరమైన ‘రవం’ (శబ్దం) చేయువాడు. అతని అరుపుకి భూమి కంపించినట్లుగా వర్ణించబడింది. శివునితో తలపడ్డ తన తప్పుని ప్రమథగణాలు తెలియచెప్పగా రావణుడు పశ్ఛాత్తాపానికి లోనయ్యాడు. అప్పుడు శివుని మెప్పించడానికి ఎన్నో విధాలుగా, పలు సంవత్సరాల పాటు స్తుతించగా, అతని శౌర్యానికీ భక్తికీ మెచ్చిన ముక్కంటి ఎన్నో వరాలతో పాటుగా’చంద్రహాస’ ఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు. ఎంత గొప్పవాడు అయినా అధర్మం వైపు ఉంటే నాశనం తప్పలేదు. రాముని కంటే ముందు మంధాత చేతిలోను ఓడిపోయాడు.

మంధాతమంధాత యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకుని అందరిలోనూ మేటిగా నిలిచేవాడు. ఇతడు ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏట రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు.. అతడిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు.

మంధాతతనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతతో కయ్యానికి కాలుదువ్వుతాడు రావణుడు. రావణుడు తాను అనుకున్నట్లుగానే మంధాతతో యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య భీకరమైన రణం కొనసాగుతుంది. మాంధాతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను ప్రయత్నించసాగాడు రావణుడు. కానీ.. అతడి బలం ముందు అవి ఏమాత్రం పనిచేయవు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా రావణుడు.. మంధాతను ఓడించలేకపోయాడు.

మంధాతఅయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే పట్టు విడని విక్రమార్కుడిలా అతడితో అలాగే పోరాడుతాడు. చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు అతని బలమెంతో తెలుసుకున్న రావణుడు.. మంధాతను ఓడించడం కష్టమని తెలుసుకుంటాడు. అయితే.. ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని మంధాత, రావణునిడికి మధ్య సంధి కుదుర్చుతారు. ఫలితంగా ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR