పుట్టినరోజు నాడు మనం పూజించి గౌరవించాల్సింది ఎవరినో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలా మంది విదేశీ సాంప్రాదాయ మొజులోపడి ఆ పద్ధతులనే అలవాటు చేసుకుని స్వదేశీ సంప్రాదాయం సంస్కృతిని ముఖ్యంగా శాస్త్రాన్ని మరిచిపోతున్నారు. పుట్టినరోజు అనేది మనం తిధుల ప్రకారం జరుపుకోవాలా లేక ఇంగ్లీష్ తేదీల ప్రకారం జరుపుకోవాలా అనే విషయంలో కొందరికి సందేహం వస్తూ ఉంటుంది.

birthday celebrationవాస్తవానికి పుట్టిన రోజు అనేది తిధుల ప్రకారం చేసుకోవడమే సర్వత్ర శుభకరం. మన భారతీయ హిందు సాంప్రాదాయం ప్రకారం దీపాన్ని వెలిగించే సంస్కృతి మనది. దీపాన్ని ఆర్పే సంస్కృతి కాదు మనది. పద్దతిగా అంటే మనం తెలుగు నెలల ప్రకారం ఏనెలలో ఏపక్షంలో ఏ తిధి రోజున పుట్టమో గుర్తుపెట్టుకుని ఆరోజే పుట్టిన రోజు జరుపు కోవడమే నిజమైన పుట్టిన రోజు అవుతుంది. అందుకే అవతార పురుషులైన శ్రీకృష్ణుని,శ్రీరాముని పుట్టిన రోజులు మనం తిధుల ప్రకారమే జరుపుకుంటాము.

sri krishna janmashtamiమన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ఏ వ్యక్తి అయిన నేను పుట్టిన రోజును చేసుకోను అనే మాటను ఎప్పుడు అనకూడదు.

జీవితంలో ప్రతి ఒక్కరికి ఓ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి శరీరం అవసరం కాబట్టి ఆ పరమేశ్వరుడు పుట్టుకతోనే మనకు శరీరాన్ని గొప్ప వరంగా ప్రసాదించాడు. అందుకోసమే మనం పుట్టిన రోజున ఒక పండుగలాగా నిర్వహించుకోవాలి. ప్రతి వ్యక్తికి కేవలం ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది.

boonకానీ ఒక అమ్మకు మాత్రం తనకు ఎంత మంది సంతానం ఉంటే అన్ని పుట్టిన రోజులతో పాటు తన పుట్టిన రోజు కూడా ఉంటుంది. తను నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది.

అలా మనకు జన్మఇచ్చిన అమ్మకు మన పుట్టిన రోజున తనకి కూడా పుట్టినరోజు గా భావించి వేడుకగా జరపాలి. అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజున తన తల్లికి ఒక కొత్త చీర సమర్పించి పాదాభివందనం చేసుకున్న తర్వాత తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలి.

modi on his birthdayఅది మనకు జన్మనిచ్చిన తల్లికి మనం ఇచ్చే గౌరవపూర్వకమైన మర్యాద. అమ్మ మనల్ని సృష్టించి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది కాబట్టి ఆమె మనకు ఒక బ్రహ్మ, ఆమె రక్తాన్ని మనకు పాలుగా మార్చి మన ఆకలి తీరుస్తుంది.

తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేదాకా గర్భసంచిలో చీకటిలో ఉన్న ఆ బిడ్డకు ఒక్కసారిగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అందుకే బ్రహ్మ ,విష్ణు, పరమేశ్వరుల త్రిమూర్తుల స్వరూపమే అమ్మ అని భావిస్తారు.

babyఅమ్మతనం కేవలం స్త్రీ నుంచి లభిస్తుంది కాబట్టి అమ్మను మాతృదేవోభవగా భావించి నమస్కరిస్తారు. ఎవరైతే ఆడతనంలో అమ్మతనాన్ని చూసి గౌరవిస్తారు అలాంటివారు దీర్ఘాయుష్షును పొందుతారని వేదపండితులు తెలియజేస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR