డ్రై ఫ్రూట్స్ కి అంత ఖరీదు ఎందుకు ? అతిగా తింటే ఎదురయ్యే సమస్యలేంటి?

డైటింగ్ చేసేవాళ్ళు, హెల్దిగా డైట్ మెంటైన్ చేవాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నీరసించిపోయిన దేహాలకు తక్షణ శక్తిని అందించడంలో డ్రై ఫ్రూట్స్ పాత్ర చాలా గొప్పది. రోజువారీ పనుల్లో బిజీబిజీగా ఉన్నపుడు ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నపుడు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఇక పని సులువుగా ఉల్లాసంగా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తింటే కడుపు నిండిన భావన ఉంటుంది. హెవీగా కూడా అనిపించదు.

dry fruitsతాజా పండ్లతో పోల్చితే డ్రై ఫ్రూట్స్ రేటు ఎక్కువే. అయితే తాజా పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకపోతే నాలుగైదు రోజులకే పాడైపోతాయి. అదే డ్రై ఫ్రూట్స్ అయితే… ఏడాదంతా నిల్వ ఉంటాయి. వాటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా అవి ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. వ్యాధి వచ్చాక మందులతో దాన్ని తగ్గించుకుంటూ ఇబ్బంది పడే కంటే అది రాకుండా చూసుకోవడం మంచిది. అందుకే ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకునే వారు వీటిని కచ్చితంగా వారి ఆహార శైలిలో భాగం చేసుకుంటున్నారు.

కిస్మిస్‌లు, అంజీర్‌, జీడిపప్పు, పిస్తా, బాదం వంటివి డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వివిధ ర‌కాల ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి కిస్మిస్‌ల‌ను త‌యారు చేస్తారు. ఇక ప‌లు రకాల పండ్ల‌ను ఎండ‌బెడితే అవి డ్రై ఫ్రూట్స్‌గా మారుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్లు ఎండలో ఎండినప్పుడు వాటిలో యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ పెరుగుతాయని అధ్యయనాలు తేల్చాయి. డ్రై ఫ్రూట్స్‌లో మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. ఇవి మనల్ని శారీరకంగా ఫిట్‌గా ఉండేలా చేస్తాయి.

vitaminsడ్రై ఫ్రూట్లలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని రోజూ ఆహారంలో తీసుకుంటూ ఉంటే డయాబెటిస్, ఒబెసిటీ లాంటి అనారోగ్యాలు కంట్రోల్‌లో ఉంటాయి. కాన్సర్ లాంటి భయంకర రోగాల్ని అడ్డుకోవడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు గుండె జబ్బులు రాకండా, బ్రెయిన్ బాగా పనిచేసేలా ఇవి చేస్తున్నాయి. మలబద్ధకం సమస్యకు ఇవి చెక్ పెడతాయి. కారణం వీటిలోని ఫైబరే. అది ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

mind sharpడ్రై ఫ్రూట్స్ ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగా ఉంటాయి. విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు పొటాషియం, మెగ్నిషియం, జింక్ వంటి మిన‌ర‌ల్స్ ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఉద‌యం తింటేనే మంచిది. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకోవాలి. సాధార‌ణంగా మ‌న‌కు ఉద‌యం పెద్ద మొత్తంలో శ‌క్తి అవ‌స‌రం అవుతుంది. మ‌నం యాక్టివ్‌గా ప‌నిచేస్తాం. క‌నుక ఆ స‌మ‌యంలో డ్రై ఫ్రూట్స్ ను తింటే మేలు జ‌రుగుతుంది. శ‌రీరానికి పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతోపాటు శ‌క్తి కూడా అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా ప‌నిచేయ‌వ‌చ్చు. ఉత్సాహంగా ఉంటారు. బ‌ద్ద‌కం ఉండ‌దు.

activeఅయితే ఉద‌యం డ్రై ఫ్రూట్స్ ను తిన‌లేమ‌ని అనుకునే వారు వాటిని సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో తిన‌డం బెస్ట్ ఆప్ష‌న్‌. ఎందుకంటే చాలా మంది ఆ స‌మ‌యంలో జంక్ ఫుడ్స్ ను తింటుంటారు. వాటికి బ‌దులుగా డ్రై ఫ్రూట్స్ ను తింటే మంచిది. రోజంతా ప‌నిచేసి బాగా అల‌సిపోతే సాయంత్రం డ్రై ఫ్రూట్స్ ను తింటే శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. అల‌స‌ట త‌గ్గుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న ఉండ‌వు. మంచి మూడ్ వ‌స్తుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.

no junk foodఅయితే కొందరు ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని, మంచి శక్తిని ఇస్తాయని అతిగా తినేస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో అతిగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామందికి తెలియదు. డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే ఇవి సులువుగా జీర్ణమయ్యే ఫైబర్ లు కాదు. దీనివల్ల జీర్ణమవడానికి చాలా సమయం తీసుకుంటాయి. వీటిని అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపుని చికాకు పెడతాయి మరియు తిమ్మిరి, ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు మొదలైన సమస్యలను సృష్టిస్తాయి.

stomach acheడ్రై ఫ్రూట్స్ అధికంగా తినడం వల్ల వేగంగా బరువు కూడా పెరుగుతారు. డ్రైఫ్రూట్స్ లో అధిక కేలరీలు ఉంటాయి. మనం తీసుకునే తక్కువ మోతాదులోనే ఎక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. రోజూ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ కేలరీలు సులువుగా శరీరంలోకి వెళ్లిపోతాయి తద్వారా బరువు పెరుగుతారు.

fatవీటిలో సహజంగా ఫ్రక్టోజ్ ఉంటుంది, ఇది చాలా ఆరోగ్యకరమైనది కాని ఎక్కువగా తినడం వల్ల వీటిలోని చక్కెరలు దంతాలకు హాని చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ పళ్లకు ఎక్కువగా అతుక్కుపోతాయి. దీనివల్ల వీటిలోని చక్కెరలు దంతక్షయం వైపుగా ప్రభావితం చేస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR