రావణుడు వినాయకుడికి మొట్టికాయలు ఎందుకు వేసాడు?

మన పురాణాలను అనుసరించి లోక కళ్యాణం కోసం దేవతలు అనేక రూపాలను సంతరించుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు రాక్షసుల నుంచి దెబ్బలు కూడా తిన్నారు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుంగా పూజలు అందుకునే వినాయకుడు ఈ ప్రపంచాన్ని కాపడటం కోసం పశువుల కాపరి వేశం వేసుకున్నాడు. అంతే కాకుండా రావణబ్రహ్మ అయిన రావణాసురుడితో మొట్టి కాయులు కూడా తిన్నాడు. అసలు ఎందుకు పశువుల కాపరి వేశం వేసుకోవాల్సి వచ్చంది? ఎందుకు ఆ విఘ్నవినాయకుడు మొట్టి కాయలు తిన్నాడు తదితర వివరాలు తెలుసుకుందాం.

Vinayakuduగోకర్ణ క్షేత్ర వివరాలు స్కందపురాణంలో కనిపిస్తాయి. ఇందులో ఉన్న వివరాల ప్రకారం లంకాధిపతి అయిన రావణుడు తన తల్లి కోసం శివుడి ఆత్మలింగాన్ని సంపాదించడం కోసం ఘోర తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సుకు మెచ్చి రావణుడు ప్రత్యక్ష మయ్యి ఆత్మ లింగాన్ని అందజేస్తాడు. అయితే అదే సమయంలో ఒక షరత్తు విధిస్తాడు. ఒక్కసారి ఆత్మ లింగం భూమిని తాకితే అక్కడే ప్రతిష్టితమై పోతుంది. అందువల్ల లంకకు తీసుకెళ్లే వరకూ సదరు ఆత్మ లింగాన్ని భూమి పై పెట్టకూడదని చెబుతారు. ఇందుకు సమ్మతించిన రావణుడు ఆత్మలింగాన్ని తనతో పాటు తీసుకువెళుతాడు.

Ravanaఆత్మలింగం రావణుడి వద్ద ఉంటే అతని బలం రెట్టింపు అవుతుందని అంతేకకాకుండా లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దైవగణాలు బ్రహ్మ, విష్ణవుల వద్దకు వెళ్లి ఈ గండం నుంచి తప్పించాల్సిందిగా వేడు కొంటారు. కొద్ది సేపు ఆలోచించిన వారిరువురూ వినాయకుడి సహకారం కోరుతారు. లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకున్న వినియకుడు బ్రహ్మ, విష్ణు ప్రతిపాదనకు అంగీకరిస్తాడు.

Vinayakaప్రణాళిక ప్రకారం విష్ణువు తన చక్రాయుధంతో సూర్యుడి గమనాన్ని అడ్డు కొంటారు. దీంతో వెలుగు తగ్గిపోయి తత్కాలికంగా సాయంత్రం అవుతుంది. దీంతో రావణుడు సంధ్యా వందనానికి సమయం అయ్యిందని భావిస్తాడు. చేతిలో అత్మలింగం ఉండటంతో సంధ్యా వందనం ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు.

Gokarnaఇంతలో అటుగా బాలుడి వేశంలో వినాయకుడు గోవులను కాస్తూ అక్కడికి వస్తాడు. విషయం మొత్తం రావణుడు బాలుడికి చెప్పి సంధ్యా వందనం చేసే వరకూ ఆత్మలింగాన్ని పట్టు కోవాల్సిందిగా అభ్యర్థిస్తారు. ఆత్మలింగాన్ని పట్టు కోవడానికి బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు అంగీకరిస్తాడు. అయితే తాను మూడుసార్లు పిలుస్తానని అప్పటికి రాకపోతే ఆత్మ లింగాన్ని భూమి పై పెడుతానని బాలుడు చెబుతాడు. ఇందుకు అంగీకరించిన రావణుడు ఆత్మలింగాన్ని బాలుడి రూపంలో ఉన్న వినాయకుడి చేతిలో పెట్టి సంధ్యా వందనానికి బయలు దేరుతారు.

Gokarnaరావణుడు కొంత దూరం వెళ్లిన తర్వాత బాలుడు త్వర త్వరగా మూడు సార్లు రావణ…రావణ…రావణ అని పిలుస్తాడు. దీంతో రావణుడు పరుగు పరుగునా వస్తాడు. అప్పటికే బాలుడి రూపంలోని వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి పై పెట్టేస్తాడు. దీంతో కోపగించుకున్న రావణుడు బాలుడి రూపంలో వినాయకుడి తల పై గట్టిగా మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి నెత్తి పై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కు ఇప్పటికీ గోకర్ణలో ఉన్న మహాగణపతి ఆలయంలోని గణపతి వగ్రహానికి చూడవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR