Home Unknown facts బ్రహ్మ దేవుడి నుండి వరాన్ని పొందిన రాక్షసుడు ఎవరు ?

బ్రహ్మ దేవుడి నుండి వరాన్ని పొందిన రాక్షసుడు ఎవరు ?

0

శివపురాణంలో ఈ రాక్షస సంహార ఘట్టం ఉంది. శివుడి కారణంగా జన్మించి శుక్రుని చేతిలో పెరిగి ఒక రాక్షసుడిగా మారి దేవలోకాన్నే జయించిన అతిభయంకరుడు ఆ రాక్షసుడు. ముల్లోకాలను ఏలుతున్న ఆ రాక్షసుడిని శివుడు తప్ప ఎవరు అంతం చేయలేరు, అంతేకాకుండా బ్రహ్మ దేవుడి నుండి మరొక వరాన్ని కూడా పొందడం వలన ఏ దేవుడు ఆ రాక్షసుడిని జయించలేకపోతారు. మరి ఆ రాక్షసుడు ఎవరు? శివుడికి ఎలా జన్మించాడు? చివరకు శివుడు అతడిని ఎలా సంహరించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి దేవేంద్రుడు, బృహస్పతి శివుడిని దర్శించడానికి కైలాసానికి వెళ్లగా వారిని పరీక్షించాలని తలచి శివుడు తలక్రిందులుగా వేలాడుతూ బేతాళ రూపంలో అక్కడ ఉండగా, వారిద్దరూ కూడా ఆయన శివుడు అనే విషయాన్ని గుర్తించకుండా, బేతాళారూపంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి శివుడు ఎక్కడ అని ప్రశ్నించగా శివుడు సమాధానం చెప్పకపోవడంతో స్వర్గానికి అధిపతి కానున్న అనే గర్వంతో దేవేంద్రుడు ఆగ్రహంతో శివుడి పైన ఆయుధాన్ని ఎత్తగా ఆ చేతిని అలానే స్థంబింపచేసాడు, అయినప్పటికి దేవేంద్రుడు ఆయన శివుడు అనేది గ్రహించకుండా ప్రతిదాడి చేయడంతో శివుడికి కోపం వచ్చి తన మూడో కంటిని తెరిచే లోగ బృహస్పతికి విషయం అర్థమై శివుడిని ప్రార్ధించడంతో, అప్పటికే శివుడి మూడోకంటి నుండి వచ్చిన ఒకటి రెండు అగ్ని కీలల్ని లవణసముద్రంలోకి విసిరేసి అంతర్ధానం అయ్యాడు శివుడు.

ఇలా పరమశివుడి కోపం ద్వారా పడిన అగ్ని బాలుని రూపం పొందగా అప్పుడు సముద్రుడు ఆ బాలుడిని బ్రహ్మ కి ఇవ్వగా అప్పుడు బ్రహ్మ చేతిలో ఉన్న ఆ బాలుడి కంటి నుండి నీరు కారడంతో జలంధరుడు అనే పేరుని పెట్టాడు. ఈవిధంగా శివుడు కి వచ్చిన కోపంలో జ్వలించిన అగ్ని కారణంగా జన్మించిన వాడే జలంధరుడు. ఇలా జన్మించిన బాలుడికి పుట్టగానే బ్రహ్మ ఇతడికి శివుడి చేతిలో తప్ప మరొకటి చేతిలో మరణం ఉండదని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇలా జలంధరుడు శుక్రుడి దగ్గర పెరిగి రాక్షస రాజుగా మారుతాడు. అయితే దైవాంశ వలన జన్మించినప్పటికీ రాక్షస గురువు పెంచడం కారణంగా రాక్షసుడిగానే పరిగణించబడ్డాడు.

ఇక కాలనేమి కూతురు పేరు బృంద ఈమె చాలా అందగత్తె. ఇక బృందకి రాక్షస రాజైన జలంధరుడికి వివాహం జరుగుతుంది. బ్రహ్మ కోసం గొప్ప తపస్సు చేసిన జలందరుడి భక్తికి మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమనగా, తనకి చావు అనేది లేకుండా వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ నే భార్య ప్రాతివత్యం తొలగిపోనంత వరకు నీకు మరణం అనేది ఉండదు అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఒక సందర్భంలో శుక్రుడు క్షిరసాగర మధనం జరిగినప్పుడు తమకు జరిగిన ఒక సంఘటన చెప్పడంతో జలంధరుడు దేవతలని శత్రులుగా భావించి, వారి పైన యుద్దని ప్రకటిస్తాడు.

శుక్రుడికి మృత్యుసంజీవిని అనే విద్య తెలుసు దీనితో యుద్ధంలో చనిపోతున్న రాక్షసులని మళ్ళీ బ్రతికిస్తూ ఉండగా జలంధరుడు తనకి ఉన్న వరం కారణంగా దేవలోకాన్ని జయిస్తాడు. అప్పుడు దేవతలంతా ప్రాణభయంతో తల దాచుకుంటారు. ఇక దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా మహావిష్ణువు బయలుదేరే సమయంలో లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుతో సముద్రంలో జన్మించడం వలన జలంధరుడు నాకు సోదరుడి వరుస అవుతాడు కనుక తనని సంహరించవద్దని వేడుకోగా దానికి శ్రీమహావిష్ణువు అంగీకరించి బయలుదేరుతాడు. ఇలా మహావిష్ణువు, జలంధరుడు అలసి పోయేవరకు యుద్ధం చేయగా ఇద్దరు శాంతిచగా శ్రీమహావిష్ణవు ముచ్చటపడి ఏదైనా వరం కోరుకో మనగ నీవు, లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చి ఉండాలి అని కోరుకున్నాడు. ఇక మాట ఇచ్చినప్పుడు చేసేది ఏమిలేక సతీసమేతంగా విష్ణువు జలందరుడి ఇంటికి వెళ్ళాడు.

ఇదే సమయంలో నారదుడు వైకుంఠానికి వచ్చినపుడు జరిగిన విషయం తెలిసి ఆలోచిస్తుండగా దేవతలు అందరు నారదుని సహాయం చేయాలంటూ వేడుకోగా వెంటనే నారదుడు జలందరుడి ఇంటికి బయలుదేరి, జలందరుడి ఆతిధ్యం స్వీకరించి ని ఇంట్లో లక్ష్మి దేవి ఉంది కానీ గృహ లక్ష్మి కూడా ఎంతో బాగుండు అని నారాయణ నారాయణ అంటూ మాట దాటివేశాడు. అప్పుడు జలంధరుడు ఏమిటి నారద సెలవివ్వండి అనడంతో నే ఇంట్లో పార్వతీదేవి కూడా ఉంటె బాగుండు కైలాసం లో శివుడి దగ్గర ఎందుకు అని నిప్పటించడంతో జలంధరుడు కైలాసానికి రాయబారిని పంపగా శివుడు కోపాద్రిక్తుడయ్యాడు. అప్పుడు రాయబారి వచ్చి శివుడి కోపాన్ని విన్నవించగా రాక్షస రాజైన నన్నే ధిక్కరిస్తాడా అని శివుడు పైన యుద్ధం చేయాలనీ భావిస్తాడు.

ఇదే సమయంలో అనువుగా భావించిన జలంధరుడు మాయాశివుడిగా మారి కైలాసానికి వెళ్లగా పార్వతి వచ్చినది మాయ శివుడు జలంధరుడు అని గ్రహిస్తుంది. అయితే ఇదే సమయంలో శ్రీమహావిష్ణువు జలంధరుడి రూపంలో బృంద దగ్గరికి వెళ్లగా వచ్చినది తన భర్తే అని భావించడంతో తన ప్రాతివత్యం పోతుంది. ఇక శివుడు అప్పుడు ఒక చక్రాన్ని సృష్టించి జలంధరుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వేసి సంహరిస్తాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు బృందని ఓదార్చి నీవు తులసి చెట్టుగా అవతరించి అందరి చేత పూజలు అందుకుంటావని వరం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

Exit mobile version