భోగిపళ్ల ఆచారం ఎందుకు వచ్చింది..?

శీతాకాలంలో మాత్రమే పండే సీజనల్ ఫ్రూట్స్ రేగి పండ్లు. భోగి పండుగకు పిల్లలపై భోగి పండ్లుగా కూడా రేగి పండ్లనే వాడతారు. సంక్రాంతి పండుగ భోగి నుండి ప్రారంభమై క‌నుమ‌తో ముగుస్తుంది. దీనిలో ఒక్కో రోజుకు ఓ ప్ర‌త్యేక‌త ఉంది.
  • భోగి రోజు భోగి మంట‌లు వేసి, అంద‌మైన రంగ‌వ‌ల్లుల‌తో ఇంటి ముంద‌రి భాగాన్ని అలంక‌రిస్తారు. అయితే భోగీ రోజు 5 ఏళ్ల లోపు పిల్ల‌ల‌పై రేగు పండ్లు పోస్తారు వీటినే భోగిప‌ళ్లు అంటారు.
  • అస‌లు ఈ సాంప్ర‌దాయం ఎందుకు వ‌చ్చింది, దీని వ‌ల్ల క‌లిగే లాభాలేంటో ఓ సారి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.
  • సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగుపళ్లు, చిల్లర డబ్బులు, బంతిపూలరెక్కలు, చెరుకు ముక్కలని తీసుకుని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు.
  • సాక్షాత్తూ నారాయణుడు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడ‌నీ, ఆ ఫలాలని తింటూ త‌న‌ తపస్సుని కొనసాగించాడ‌ని… దేవుడికే ప్రీతిపాత్ర‌మైన ఈ పండ్లను పిల్ల‌పై పోస్తే…సాక్షాత్తు నారాయ‌ణుడే దీవించిన‌ట్టు అని న‌మ్మ‌కం. దక్షిణభారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి రావ‌డం కూడా ఈ సాప్ర‌దాయం కొన‌సాగ‌డానికి కార‌ణం.
  • రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించింది, అందుకు దీన్ని ‘ఇండియన్‌ డేట్స్ అని పిలుస్తారు. రేగు చెట్టు -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది. రేగు ప‌ళ్ల‌లో ‘సి’విటమిన్ అధికం, దీని వ‌ల్ల‌ రోగనిరోధకశక్తిని పెరుగుతుంది.
  • రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR