Home Unknown facts Why Do We Celebrate Dussehra Festival ?

Why Do We Celebrate Dussehra Festival ?

0

మనం జరుపుకునే అతిముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి. తొమ్మిది రోజులు జరుపుకునే దేవి నరవరాత్రలు మరియు పదవ రోజు జరుపుకునే విజయదశమి కలిపి దసరా అని అంటారు. మరి దసరా పండుగ వెనుక ఉన్న పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Dussehra Festival

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. దసరా పండుగ మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికి, తరువాతి మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక ఆలయాలలో ఒక్కో రోజు ఒక్కో అలంకరణ అంది చేస్తుంటారు. ఇక విషయంలోకి వెళితే, రాముడు రావణుడిని సంహరించి విజయం సాధించిన రోజు, పాండవులు జమ్మిచెట్టు పైన దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు, దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి సంహరించిన రోజు ఇదేనని ఈరోజే వారు విజయాన్ని సాధించారని చెబుతారు. దీనినే చెడు పైన మంచి విజయం అని చెబుతారు.

ఇలా వధించి విజయం సాధించిన పదవ రోజున ప్రజలంతా కూడా ఆనందంతో విజయదశమి జరుపుకుంటారు. దేవి నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో దేవతా రూపంలో అమ్మవారిని పూజిస్తారు. అవి, జగదాంబ సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, వైష్ణవి దేవి, కాళికాదేవి, సంతోషిమాత, చాముండేశ్వరీమాత, మహాదేవి, లలితాదేవి రూపంలో పూజించగా దసరా పండుగ రోజున పరమాత్ముడు దేవికి సర్వ శక్తులు ప్రసాదించి దుర్గాదేవి ద్వారా మహిషాసుర మర్దన గావించినందున అష్టశక్తి అయినా దుర్గాదేవిని పూజిస్తారు.

Exit mobile version