Home Unknown facts చిన్న పిల్లలకు న‌ల్లని దిష్టి చుక్క ఎందుకు పెడతారు?

చిన్న పిల్లలకు న‌ల్లని దిష్టి చుక్క ఎందుకు పెడతారు?

0

నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట మనకు పెద్దలు చెబుతారు. పెద్దలు చెప్పే మాటలు దేనిని పక్కన పెట్టకూడదు కొన్ని మూడ నమ్మకాలు అనుకున్నా వాటి వెనుక సైన్స్ కి సంబంధించిన కారణం ఉంటుంది.

దిష్టి చుక్క పెట్టడం వెనుక కారణంచిన్నపిల్లలని చూస్తే ఎవ‌రైనా… అబ్బా… ఎంత ముద్దొస్తున్నారో అంటారు. కొంతమంది బ‌య‌టికి అనకపోయినా, మనసులో అనుకున్నా పిల్ల‌ల‌కు దిష్టి తాకుతుంద‌ని మ‌న పెద్ద‌లు న‌మ్ముతారు. అందుకే తరుచూ పిల్ల‌ల‌కు దిష్టి తీసేస్తారు. అయితే దిష్టి తీసేయడంతోపాటు పిల్ల‌ల‌కు ఎవరి దిష్టి తలగకుండా న‌ల్లని దిష్టి చుక్క పెడ‌తారు. అది ఎందుకో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి సమస్యలు వస్తాయి, ఇది పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది.

పిల్ల‌ల‌కు న‌ల్లని దిష్టి చుక్క పెట్ట‌డం వల్ల వారికి దిష్టి త‌గ‌ల‌ద‌ట‌. అంతేకాదు, ఎవ‌రైనా అలాంటి పిల్ల‌ల‌ను చూడ‌గానే వారి దృష్టి ముందుగా ఆ చుక్క మీద‌కు వెళ్తుంద‌ట‌. దీంతో పిల్ల‌ల‌కు దిష్టి త‌గ‌ల‌ద‌ని వారి న‌మ్మ‌కం. ఈ క్ర‌మంలో పిల్ల‌ల‌కు నెగెటివ్ ఎన‌ర్జీ కాకుండా పాజిటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంద‌ట‌. దాంతో వారి ఆరోగ్యం బాగుంటుంద‌ని న‌మ్ముతారు.

అంతేకాదు అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి వుంటుందని భావించి.. రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపేయాలి. ఇలా ఐదేళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా చేస్తుంటారు. అయితే చిన్నపిల్లలకు నిమ్మకాయ, మిరపకాయ దిష్టి మాత్రం తీయద్దు, ఐదేళ్లు దాటిన తర్వాత మాత్రమే తీయాలి అంటున్నారు పండితులు.

 

Exit mobile version