బంతి  పూలంటే గణపతికి ఎంతో ప్రీతి…!

హిందూ మతంలో, ప్రతి దేవుడికీ ఇష్టమైన పూలు ఉన్నాయి. హిందూ పద్ధతిలో పూజించడంలో పూలు  ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మీరు ఆ దేవుడికి ఇష్టమైన పూలతో పూజిస్తే, మీ కోర్కెలన్నీ నెరవేరుతాయని నమ్మకం.
  • సాధారణంగా హిందువులు ఎంతో మంది దేవతలను పూజిస్తూ వారి ఆశీస్సులను పొందుతారు. ఈ క్రమంలోనే ముల్లోకాలలో ముక్కోటి దేవతలకు ఎంతో ఇష్టమైన పువ్వులు, పండ్లను, నైవేద్యాలను సమర్పిస్తూ స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.
  • అలాగే ముక్కోటి దేవతలలో మొదటి పూజ్యుడిగా అందరూ వినాయకుడిని పూజిస్తారు. ఏకార్యం చేసిన ముందుగా వినాయకుడి పూజ చేయడం వల్ల ఆ కార్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ శుభకార్యాలు జరుగుతాయని వినాయకుడి పూజ చేస్తారు.
  • ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి రోజు దేశ వ్యాప్తంగా హిందూ ప్రజలు పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ వినాయకచవితి రోజే గణపతి విగ్నేశ్వరుడుగా మారాడని భావించి భాద్రపద శుక్ల చతుర్దశి రోజు వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
  • ఈ వినాయక చవితి రోజు స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేసి, పిండివంటలను నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు. ఈ క్రమంలోనే వినాయకచవితి రోజు మాత్రమే కాకుండా మనం ఎప్పుడైనా వినాయక పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా వినాయకుడి పూజలో స్వామి వారికి ఎంతో ఇష్టమైన బంతిపువ్వును ఉపయోగించాలి.
  • బంతిపూలు అంటే స్వామి వారికి ఎంతో ఇష్టం. ఈ పువ్వుతో స్వామివారికి పూజ చేయడంవల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు. బంతి పువ్వు అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పిస్తుంది. అదేవిధంగా శుభానికి సంకేతంగా బంతి పువ్వులను భావిస్తారు కాబట్టి వినాయకుడికి బంతి పూలతో పూజ చేయడం వల్ల అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR