శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని ఎందుకు కొలుస్తారో తెలుసా

ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆటంకం కలగకుండా చూడమని ఆ విజ్ఞేషుని తలుచుకుంటూ కచ్చితంగా పఠించే శ్లోకం..

“శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్, సర్వవిఘ్నోపశాంతయే”

Saraswati is measured as Shuklambara Dhariniస్వచ్ఛమైన ఆకాశం లాంటి తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షాలను నాలుగు భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని దీని అర్ధం.

Saraswati is measured as Shuklambara Dhariniఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందింది అని అనుకుంటాం. కాని, శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.

Saraswati is measured as Shuklambara Dhariniఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి మంత్రానికి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR