గంగా యమున అని ఎందుకు కలిపి చెబుతారు?

భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. వర్షపు నీటి వల్ల కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. మరి కొన్ని నదులు సముద్రంలో కలిసి పోతాయి. కానీ ఒక నది మాత్రం అటు భూమిలో ఇంకిపోకుండా, ఇటు సముద్రంలో కవలకుండా అలా పారతూ ఉంటుంది.

వినడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన ఇది నిజం.
మరి ఆనది ఏది? ఆనది విశిష్టత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.

ganga and yamunaచాలా పురాణాలలో ఈ నది ప్రస్తావన వచ్చింది.
కురుక్షేత్ర కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నది ఒకే సాధారణ నీటిమట్టంతో ప్రవహిస్తూనే ఉంది. అందుకే ఈ నదిని జీవనది అని పిలుస్తారు.
ఇంత విశిష్టత కలిగిన ఈ నది పేరు యమునా.

ganga and yamunaహిమాలయ పర్వతాలలో పుట్టిన ఈ నదికి ఎంతో చరిత్ర ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కు ఉత్తరాన ఉన్న యమునోత్రి వద్ద ఈ నది ప్రవహించడంతో ఈ నదికి యమునా నది అనే పేరు వచ్చింది. ఈ నదిని హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించి నిత్య పూజలు చేస్తుంటారు.

yamuna riverఅదేవిధంగా సూర్యుని పుత్రిక యమునా శాపం వల్ల ఛాయాదేవి హిమాలయాల్లో నదిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. గంగా యమునా నది పక్కపక్కనే ప్రవహిస్తూ ఉండటం వల్ల వీటిని గంగా-యమునా అని పిలవడమే కాకుండా గంగానదికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారో యమునా నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. గంగా నదికి ఎడమ వైపున పుట్టి కుడి వైపు ప్రవహించే ఏకైక ఉపనదిగా యమునా నదిని భావిస్తారు.

ganga and yamunaఋగ్వేదంలోనూ ఈ నది ప్రస్తావన ఉంది. ఈ నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు 12 రోజులపాటు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ పుష్కరాలలో భాగంగా లక్షల సంఖ్యలో భక్తులు ఈ నదిలో స్నానమాచరించి యమునా నదికి పూజలు నిర్వహిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR