గోవర్ధన పూజ ఎందుకు జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత ఏంటి ?

గోవర్ధన పూజ అనేది దీపావళి పూజలో ఒక భాగంగా ఉంది. మరియు ఇంద్రుడి పై శ్రీ కృష్ణభగవానుని విజయం గౌరవార్థం ప్రశంసించబడుతుంది. ఇది దీపావళి యొక్క నాలుగో రోజు జరుపుకుంటారు. గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.

Govardhana Pujaభాగవతం లో ప్రస్థావించబడిన ఒక పర్వతం పేరు గోవర్ధనం. దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది. గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధిచేయడం అని అర్ధం. శ్రీకృష్ణుడు యాదవ కులంలో ఉండగా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు.

Govardhana Pujaఅటువంటి ఆధ్యాత్మిక దినం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. సాంప్రదాయ హిందూ పురాణాలలో పవిత్ర రచనలు మరియు కథలు భగవంతుడు కలిగి ఉన్న శక్తి గురించి చక్కగా వివరించబడి ఉంటుంది. పూర్వం బృందావనంలో వర్షాలు బాగా పడేందుకు ,సశ్య శామలంగా ఉండేందుకు ఇంద్రభగవానుడికి, వర్షదేవుడికి పూజలు చేసే వారు. కానీ పక్కన ఉన్న గోవర్ధన గిరి బృందావనంను ఉద్ధరిస్తుంది, గోవులను పాలిస్తుంధి. అలంటి గోవర్ధగిరిని పూజించకుండా ఇంద్రుడిని పూజించడం ఏంటని నిలదీస్తూ, గోవర్ధన కొండను ప్రార్థించమని శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. ఇది చూసిన ఇంద్రుడు దిగ్ర్భాంతి కి లోనయి, కోపంతో ఆ ఊరిని తీవ్ర వర్షంతో ముంచేయమని వరుణ దేవుడికి ఆజ్ఞాపిస్తాడు. జంలప్రళయం వచ్చి బృందావన ప్రజలను ముంచి వేసి అనేక జీవనాధారాలను ముంచివేసింది.

Indhruduఅయినప్పటికీ, కృష్ణభగవానుడు వెనక్కి తగ్గలేదు. తన చిటికెన వేలితో గోవర్ధన్ గిరిని ఎత్తి వేసి నివాసులను,గోవులను కాపాడాడు. ఇది ఏడు రోజులు, ఏడు రాత్రులు వరకు కొనసాగింది. చివరకు ఇంద్రుడు తన అపరాధాన్ని అర్థం చేసుకుని కృష్ణుడికి నమస్కరించాడు.

Govardhana Pujaఅటువంటి సంఘటన తరువాత భక్తులు, శ్రీకృష్ణభగవానుని కి సంబంధించిన ఒక లక్షణం గా, పూజ సమయంలో ధాన్యపు భారాన్ని సమర్పిస్తారు . ఇది గోవర్ధన కొండకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR