ఇతర మతాలలో లేని విగ్రహారాధన హిందూ మతంలో ఎందుకు?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళేది దేవుడి దర్శనానికి. ఇంట్లో కూడా దేవుడి ప్రతిమలను పెట్టి పూజిస్తాం. అయితే ఇతర మతాలలో వలే కాకుండా హిందువులు విగ్రహారాదన చేస్తారు. దేవుని అవతారంగా విగ్రహాలను పూజిస్తారు.

pooja roomఇంటిలో ప్రత్యేకంగా ఒక దేవుడి గదిని ఏర్పాటు చేసి, అక్కడ విగ్రహాలను పెట్టి భక్తితో పూజలు చేస్తారు.
హిందువులు విగ్రహారాధనను ఎందుకు నమ్ముతారు అంటే.. దేవుడు వారి జీవితాల్లో అంతులేని బలం మరియు శక్తిని ఇస్తాడని నమ్మకం. దేవుడి విగ్రహం అనేది ఒక నమ్మకం. ఒక ధైర్యం. పవిత్రమైన మార్గంలో నడిపించే ఒక శక్తి.

devi mataహిందు మతంలో శాస్త్రాలు ప్రతి ఇంటిలో దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలని మరియు విగ్రహాలకు నియమంగా పూజలు చేయకపోతే వ్యతిరేక ప్రభావాలు వస్తాయని చెప్పుతున్నాయి. అంతే కాకుండా పూజ గది ప్రత్యేకంగా ఉండాలి. బెడ్ రూంతో కలిపి పూజ గది ఉండకూడదు. ఎందుకంటే దేవుని ముందు ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడకూడదు. అందువల్ల పూజ గది ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి.

poojaఅలాగే పూజ గది తూర్పు ముఖంగా ఉంటే మంచిది. వంట గదిలో ఉండకూడదు ఇంటిలో వంటగది అనేది స్వచ్ఛమైన మరియు పరిశుభ్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. కానీ చాలా కుటుంబాలు వంటగదిలో డస్ట్ బిన్ ని పెడుతూ ఉంటాయి. అలాగే వంటగదిలో పొగ కూడా వస్తుంది. అందువల్ల దేవుని గదిగా ఉపయోగించటానికి వంటగది అనువైన ప్రదేశం కాదు.

pooja room doorఅన్నిటికంటే పూజగది స్థానం ముఖ్యం
రెండు అంతస్థులు లేదా ఎత్తైన ప్రదేశంలో నివసిస్తున్న వారు దేవుని గదిని టాయిలెట్ ప్రాంతం కింద లేదా పక్కన లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పవిత్రమైన పూజ గది అనారోగ్యమైన ప్రాంతంలో ఉంటే పాపం కలుగుతుంది.

door locking pooja roomసెలవులను ఎక్కువ రోజులు గడపటానికి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు పూజగదికి తాళం వేయకూడదు.
ఎందుకంటే ఇంటి చుట్టు ఉన్న ప్రసన్నమైన శక్తి బ్లాక్ అవుతుంది. దేవుడి గదిని ప్రతి రోజు శుభ్రం చేయాలి.
ప్రతి రోజు విగ్రహాలను మరియు పోటోలను శుభ్రంగా తుడవాలి. ఎప్పుడు పూజగదిని అపవిత్రంగా ఉంచకూడదు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR