మగవారికి వారికి లేని ప్రాతివత్య ధర్మం స్త్రీలకు ఎందుకు?

చాలా మందికి మగ సంతానం మీద మక్కువ ఉంటుంది ఎందుకంటే వారి వారి వంశం మోస్తారని. ఆడపిల్లను ఒకరి ఇంటికి పంపించేస్తాం అనుకుంటారు. కానీ ఒక వంశం నిలబడాలి అంటే స్త్రీ మూర్తి చాలా ముఖ్యం.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం వ్రతాలు, నోములు ,ప్రాతివత్య నియమాలు స్త్రీలు ఆచరించే విధంగానే ఉన్నాయి. వీటిలో పురుషుల పాత్ర చాలా తక్కువే అని చెప్పవచ్చు.

familyదీని గురించి వివరణలోకి వెళ్ళితే. గరుడ పురాణం ప్రకారం మానవులు చేసే తప్పులకు నరకంలో శిక్షలు పడతాయి. స్త్రీ,పురుషులు ఇద్దరికి శిక్షలు సమానంగానే పడుతూ ఉంటాయి.

garuda puranaతన వంశం పురోగాభివృద్ది చెందటానికి ఇంటి యజమాని కొడుకుకి సరైయినా స్త్రీని ఎంపిక చేసి వివాహం చేస్తూ ఉంటారు. ఒక వంశానికి వచ్చే సమస్యలు పురుషుల కారణంగా చాలా తక్కువగా వస్తాయి. కానీ ఒక వంశం నుంచి వచ్చి మరోక వంశానికి చేసే స్త్రీ యొక్క తప్పిదం చేత ముందు తరం యొక్క పితృ దేవతలు విశేషమైన క్షోభను అనుభవిస్తారు.

men and women equalఒక స్త్రీ ఒక వంశ పురోగాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఒక స్త్రీ ఒక వంశం నిలబడటానికి తోడ్పడుతుంది. స్త్రీ ఒక వంశం ఉత్తమ గతులను పొందటానికి కూడా తోడ్పడుతుంది.
ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశంలో యోగ్యుడైన బిడ్డకు జన్మ నిచ్చిందో అప్పుడే పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి అవుతుంది.

girl child or womenఅందువల్ల వీటికి కారణమైన స్త్రీకి ప్రాతివత్య నియమాలను పెట్టారు. అందువల్ల ప్రత్యేకించి పురుషులకు ఎటువంటి ప్రాతివత్య నియమాలు లేవు. ఒక స్త్రీ వంశ అభివృద్ధికి తోడ్పాటు అందించటం వల్ల ధర్మ శాస్త్రంలో స్త్రీలకు ప్రత్యేకంగా ఈ నియమాలను చెప్పారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR