చాలా మందికి మగ సంతానం మీద మక్కువ ఉంటుంది ఎందుకంటే వారి వారి వంశం మోస్తారని. ఆడపిల్లను ఒకరి ఇంటికి పంపించేస్తాం అనుకుంటారు. కానీ ఒక వంశం నిలబడాలి అంటే స్త్రీ మూర్తి చాలా ముఖ్యం.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం వ్రతాలు, నోములు ,ప్రాతివత్య నియమాలు స్త్రీలు ఆచరించే విధంగానే ఉన్నాయి. వీటిలో పురుషుల పాత్ర చాలా తక్కువే అని చెప్పవచ్చు.
ఎప్పుడైతే ఒక స్త్రీ తన వంశంలో యోగ్యుడైన బిడ్డకు జన్మ నిచ్చిందో అప్పుడే పితృదేవతానుగ్రహం చేత వంశం వృద్ధి అవుతుంది.