హిందూ సాంప్రదాయంలో మాంసాహారాన్ని ప్రత్యేక రోజుల్లో ఎందుకు నిషేధించారు..?

ఈరోజుల్లో మారిన కాలానికి అనుగుణంగా మన  సంస్కృతిలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకోవాలి. కాలం ఎంత మారినా ఇప్పటికీ చాలా మంది హిందువులు కొన్ని ప్రత్యేక రోజుల్లో మాంసం తినరు. చికెన్, మటన్, చేపలను అస్సలు ముట్టుకోరు.
కొన్ని ప్రత్యేక రోజుల్లో కేవలం శాకాహారం మాత్రమే తింటారు. ముఖ్యంగా సోమవారం, గురువారం, శనివారం హిందువులు మాంసాన్ని ముట్టరు. అలాగే ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజు కూడా కొందరు మాంసాన్ని ముట్టరు. ఇక సంక్రాంతి, దసరా, సంకటి చతుర్తి , ఆంగార్కి చతుర్ధి, ఏకాదశి, గుడిపదవా, అక్షయత్రుతియ, దీపావళి నిర్వహించుకునే రోజుల్లోనూ హిందువులు మాంసాన్ని అస్సలు ముట్టరు.
మనదేశంలో చాలా మంది సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. మన పూర్వికుల నుంచి వారంలో కొన్ని రోజులు మాంసం తినకుండా ఉండే అలవాటు ఉంది. అందుకు కొన్ని కారణాలున్నాయి. వారం మొత్తం మాంసాహారమేతింటే ఈ భూమిపై జీవరాశి మనుగడ లేకుండా పోతుంది. అందుకే వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను, పక్షులను చంపడం హిందువులు పాపంగా భావిస్తారు. ఆ రోజు మాంసం తినడం కూడా మంచిది కాదని భావిస్తారు. ఒకవేళ తింటే ఏదైనా అపశకునం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతారు.
రోజూ మాంసం తినడానికి అలవాటు పడిన బాడీకి కావాల్సిన ఐరన్, విటమిన్ B12, ఇతర కీలకమైన పోషకాలన్నీ మాంసం తినడం ద్వారా అందుతాయి. అందువల్ల అప్పుడప్పుడు మాంసం తినాలని మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేశారు. కానీ రానురాను మనిషి రోజూ మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. ప్రతి రోజూ నేను చికెన్ బిర్యానీ తిన్నానని గొప్పగా చెప్పుకునేదాకా వెళ్లాడు.
అలా రోజూ మాంసం తినడం ఆరోగ్యానికి మంచిదికాదు. రోజూ మాంసాహారం తినడం వల్ల పైల్స్ వస్తాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. పెద్దపేగు కాన్సర్ కు గురయ్యే అవకాశం ఉంది. అలాగే రక్తపోటు, గుండెపోటు బారినపడే అవకాశం ఉంది. అందువల్ల హిందూమతం ప్రకారం కొన్ని ఆచారాలను సాంప్రదాయాలను ఏర్పరిచారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR