Why Is Science Born From Hindu Traditions

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు అనేవి ఉన్నాయి. ప్రతి ఆచారం వెనుక శాస్రియమైన కారణం అనేది ఉంది. అసలు సైన్సు పుట్టిందే హిందూ సంప్రదాయాల నుండి అని చెబుతుంటారు. మరి అలా అనడం వెనుక కారణం ఏంటి? హిందూ ఆచారాల వెనుక ఉన్న శాస్రియమైన కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hindu Traditions

గెలీలియో 15 వ శతాబ్దంలో కనుగొన్న టెలీస్కోప్ ద్వారా నవ గ్రహాల విషయం ప్రపంచానికి తెలిసింది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పురాణాలలో నవ గ్రహాలు ఉన్నాయని చెప్పి, వాటిని పూజించారు,ఇప్పటికీ పూజిస్తున్నారు. గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది న్యూటన్. అయితే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది. ఇక విమానం – పుష్పకవిమానం , అశరీరవాణి -రేడియో, మాయాదర్పనం- టెలీవిజన్, దృశ్యదర్శిణి-గూగుల్, టెష్ట్ ట్యూబ్ బేబి – కౌరవులు, మయసభ- 3D హౌస్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో మన పురాతన కాలం నాటి టెక్నాలజీ గా చెప్పవచ్చు.

Hindu Traditions

ఇంటి ముందు వేసే చుక్కల ముగ్గులో మాథెమాటిక్స్ లోని సూత్రం దాగి ఉంది. ఇంకా వలయాకారపు ముగ్గులో, కేంద్రకం, ఎలక్ట్రాన్స్, న్యుట్రాన్స్, వాటి కక్ష్యలు ఉంటాయి. ఇది ఇలా ఉంటె ఆచారాలలో దాగి ఉన్న అంతరార్థం గురించి చెప్పుకుంటే ముందుగా గుడి గంటలు. ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయని అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏకమవ్వడంతో దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త కలిగి ఏకాగ్ర‌త పెరుగుతుంది అని చెబుతారు. ఇంకా గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయని చెబుతారు.

నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం:

Hindu Traditions
భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంది. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వస్తాయి. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయి. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడదు.

ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం:

Hindu Traditionsఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామని అంటారు. ఎందుకంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు పడుతుంది.

ఉపవాసం:

Hindu Traditionsహిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు. ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బడతాయి. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు వంటివి రావు.

రావి చెట్టుని పూజించడం:

Hindu Traditionsరావి చెట్టు ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంది.

Hindu Traditions

ఇలా ప్రతి ఆచారం వెనుక శాస్రియమైన కారణం అనేది ఉందని చెబుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR