శివుడికి ఏ పదార్ధం తో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి

పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును.

Lord Shivaపసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది.గ్రహదోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

శివుడికి ఏ పదార్ధం తో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలుపంచామృతంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది.

శివుడికి ఏ పదార్ధం తో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలుబత్తాయిపండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్యాలు మాయమవుతాయి. అనేక రకాల పుష్పాలతో అభిషేకం చేస్తే రాజభోగాలు, వెండిధూళి లేదా వెండి రజనుతో శివుడిని అభిషేకిస్తే విద్యాప్రాప్తి కలుగుతాయట.

శివుడికి ఏ పదార్ధం తో అభిషేకం చేస్తే ఎటువంటి ప్రయోజనాలునవధాన్యాలతో ఆరాధిస్తే ధనంతోపాటు భార్యాపుత్రలాభం, పటికబెల్లంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయట. ఉప్పుతో అభిషేకం చేస్తే సౌభాగ్యం చేకూరుతుంది. విభూదాభిషేకంతో సర్వకార్యాలు ప్రాప్తిస్తాయి.

శివుడి అభిషేకంబెల్లంతో అభిషేకం చేసినట్లయితే ప్రేమవ్యవహారాల్లో విజయం సాధిస్తారట. వెదురు చిగుళ్లతో అభిషేకం చేస్తే వంశవృద్ధి, సుఖాలు కలుగుతాయట. మారేడు చెట్టు బెరడు, వేర్ల నుంచి తీసిన భస్మంతో లింగాభిషేకం చేస్తే దారిద్ర్యనాశనమవుతుంది. ఇక వివిధ రకాల పండ్లతో చేసే అభిషేకం వల్ల జయం కలుతుంది.

శివుడి అభిషేకంఉసిరికాయలతో చేస్తే మోక్షం, సువర్ణం పొడిగా చేసి అభిషేకం చేస్తే మహాముక్తి లభిస్తాయట. అష్టదాతువులతో చేసే అభిషేకం వల్ల సిద్ధి, మణులు, వాటి పొడులతో అభిషేకిస్తే అహంకారం తొలగిపోతాయట. పాదరసంతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయట. చెరకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం వుండదు, యమభయం వుండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR