గౌరీ వ్రతం ఎందుకు అంత ప్రత్యేకం ? దాని ప్రాముఖ్యత ఏంటిది

0
314

నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది. వ్రతాలు చాలా వరకు స్కాందపురాణాంతర్గతమైనవిగా కనపడతాయి. సాధారణంగా ఆడవారు చేసే పూజలు, వ్రతాలు నోములు చాలా వరకు అయిదోతనం కోసం అయి ఉంటాయి. కొన్ని మాత్రం పిల్లలు కావాలనో, ఉన్న పిల్లలు బాగుండాలనో, వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతుంది.

గౌరీ వ్రతంచిత్రమైన వాస్తవం ఏమంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటీ తమ కోసం చేసుకొనేది లేదు. ఇంక చిత్రం ఏమంటే మహిళలు తమ భర్తల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, పదోన్నతి కోసం అంటూ ఎన్నో వ్రతాలు, నోములు చేస్తారు. ప్రతి నోము మన సంస్కృతీ సంప్రదాయాలను, మనం ఏవిధంగా జీవించాలో తెలియ చేస్తాయి.కొన్ని వందల నోములు మనం చేసేవి ఉన్నాయి.

గౌరీ వ్రతంహిందూ సంప్రదాయాల్లో పెళ్ళికి చాలా విశిష్టత ఉంది.వివాహం లో ప్రతి ఘట్టం సంప్రదాయాల గొప్పతనం తెలియజేస్తుంది.అందులో గౌరీవ్రతం చాల ముఖ్యమైనది.దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

గౌరీ వ్రతంహిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో గౌరీ పూజ జరుగుతుంటుంది. ప్రతిఒక్క అమ్మాయితో ఈ పూజ చేయిస్తారు తల్లీదండ్రులు. పెళ్లి తంతుల్లో గౌరీపూజకి ప్రత్యేక స్థానం ఉంటుంది. గౌరీ దేవిని మాంగల్యానికి ఆదిదేవతలా భావిస్తారు. వివాహానికి ముందే ఈ దేవతను పెళ్లికూతురితో పూజిస్తారు. కారణం గౌరీదేవి పరమశివుడి భార్య. ఆయన విపత్కర సమయంలో కాలకూట విషం తాగినా ఆమె మాంగల్యబలంతో సౌభాగ్యం నిలిచే ఉంది.

గౌరీ వ్రతంఅమ్మవారిని పూజించడం వల్ల భవిష్యత్‌లో భాగస్వామికి ఎలాంటి సమస్యలు వచ్చినా అవి అతడిని ఏం చేయాలేవనే, పరిపూర్ణమైన సౌభాగ్యాలు వధువుకి జీవితాంతం తోడుండాలనే గౌరీ పూజ చేయిస్తారు. గౌరీపూజ సమయంలో తల్లిదండ్రులు పక్కనే ఉండే ఈ తంతుని చేయిస్తారు. ఎల్లవేళలా భర్తని కాపాడాలంటూ.. తన మాంగల్యం నిండునూరేళ్లు పచ్చగా ఉండాలని కోరుకుంటూ చేయడమే గౌరీ పూజ ముఖ్య ఉద్దేశ్యం.

SHARE