విభూతి ఎందుకు అంత పవిత్రమైనది ? దాని విశిష్టత ఏమిటి

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలకు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మంలో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపాలు, యజ్ఞాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము.

విభూతిమన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది. కాని ఈ కాలము లో అలా చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

విభూతిఈ భస్మ ధారణ చేయడానికి శాస్త్రాలలో కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రీయులు “మానస్తోకే మంత్రము ” తో, వైశ్యులు ” త్ర్యయంబక ” మంత్రముతో, ఇతరులు శివపంచాక్షరితో భస్మ ధారణ చెయాలి. ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.

విభూతిమహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో పవిత్రంగా తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని పౌష్ఠికం అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని కామదం అని అంటారు.

విభూతిభస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి. యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మండించడం ద్వార వచ్చిన అగ్నితో, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి. అనంతరం శుభ్రమైన పాత్రలో విభుతిని నింపాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR