బెల్లంతోనే ఎందుకు పిండివంట‌లు చేస్తారు? దాని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

ఏదైనా పండగ వ‌స్తుందంటే చాలు పూజ‌లు, పిండివంట‌లే గుర్తుకువ‌స్తాయి. పూజ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. పిండివంట‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి అనేక ర‌కాలు చేస్తుంటారు. అయితే పిండివంట‌ల‌తో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లంతో పిండివంట‌లు ఎక్కువ‌గా చేస్తారు. మ‌రి బెల్లంతోనే ఎందుకు పిండివంట‌లు చేస్తారో తెలుసా ? అయితే దాని వెన‌క ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పిండివంట‌లుపూర్వకాలంలో ఎక్కువగా బెల్లం వాడేవారు. కానీ చక్కెర వచ్చాక బెల్లం వాడకం బాగా తగ్గిపోయింది. సులువుగా ఉండటం.. సులభంగా ఉపయోగించడం ఇందుకు కారణాలు కావచ్చు. కానీ బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పిండివంట‌లుబెల్లంని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది. అందుకనే భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఒక పలుకు బెల్లం తినమని చెబుతూ ఉంటారు పెద్దలు.

పిండివంట‌లుబెల్లాన్ని సేవించినట్లయితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.

Jeerna kriyaభారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటల తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు. పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే బాలింతలని బెల్లం తినమని చెబుతుంటారు.

5 Mana Aarogyam 198బెల్లపు నీరు వల్ల ఒంట్లోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పకుండా ఉంటాయట. వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉంది. మ‌రియు కీళ్ల సమస్యలకి ఉపశమనం క‌లిగిస్తుంది. అందుకే శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే బెల్లాన్ని పిండివంట‌ల‌కు ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR