Home Unknown facts లక్ష్మీదేవి కుమార్తెకు పార్వతిదేవి కుమారునికి వివాహం ఎందుకు జరిపించారు

లక్ష్మీదేవి కుమార్తెకు పార్వతిదేవి కుమారునికి వివాహం ఎందుకు జరిపించారు

0

సుబ్రహ్మణ్యస్వామికి, లక్ష్మిదేవి కుమార్తె అయిన శ్రీవల్లీదేవితో వివాహం చెయ్యాలని పార్వతిదేవి మనసు పడిందట. బుద్ధిమంతురాలు, మహాసౌందర్యవతి, పైగా సంపదల తల్లి తనయ శ్రీవల్లి.

Subramanya Swamyఆ విషయమే తన భర్త అయిన శివభగవానుడితో చెబితే ఆయన నవ్వి ధ్యానంలోకి వెళ్ళిపోయాడట. దాంతో పార్వతి లక్ష్మిదేవితో విషయం కదిలించింది. మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేస్తే మా అమ్మాయికి లభించేదేముంది. మంచుకొండ, రుద్రాక్షమాలలు, ఇంత విభూది తప్ప అని పెదవి విరిచేసరికి, పార్వతిదేవి కన్నీటి పర్యంతమై శివునికి విషయం చెప్పి విచారించింది.

అప్పుడు శివుడు తన ఒంటిమీది ఓ రుద్రాక్షనిచ్చి ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని ఇమ్మని అడుగు అని పంపిస్తాడు. పార్వతిదేవి శివుడిచ్చిన రుద్రాక్షతో లక్ష్మిదేవిని కలిసి, తన వచ్చిన పని చెబుతుంది. లక్ష్మిదేవి ఆ రుద్రాక్షను ఓ త్రాసు తెప్పించి తూచాలని చూసింది, తన ఒంటిమీది ఆభరణాలేకాదు, తన సంపదనంతా వేసి తూచినా ఆ రుద్రాక్ష తూగక పోయేసరికి ఆ సంపదల తల్లి ఆశ్చపోయింది.

ఇంకా ఇలాంటి రుద్రాక్షలు నా స్వామివద్ద ఎన్నో వున్నాయి అని పార్వతి అనేసరికి పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను షణ్ముఖునికిచ్చి వివాహం చేస్తుంది.

అంతకు ముందు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం జరిగింది. వారి పెళ్ళికి ముందు సమస్త లోకాలు తారకాసురుని పాలనలో విపరీతమైన కష్టనష్టాలకు లోనవుతున్న సమయం. దేవేంద్రుని కూతురు దేవసేనను కుమార స్వామికిచ్చి పెళ్ళి చేస్తే తారకాసురుని సంహారానికైన మార్గం సుగమం అవుతుందని బ్రహ్మదేవుడు చెప్పగా ఇంద్రుని కూతురైన దేవసేనకు, కుమార స్వామికి అత్యంత వైభవంగా పెళ్ళి జరిగింది. అనంతరం కుమార స్వామి తారకాసురుని సంహరించాడు.

 

Exit mobile version