పేను కొరుకుడు ఎందుకు వస్తుంది దాని నివారణ మార్గాలు

తల మీద జుట్టు అనేది పెట్టని కిరీటం వంటిది. కానీ పేనుకొరుకుడు వ్యాధి ఆ కిరీటాన్ని ముక్కచెక్కలు చేస్తుంది. వెంట్రుకలు బిల్లలు బ్లిలుగా ఊడిపోతూ తలంతా వికృతంగా మారుతుంది. ఈ సమస్యతో వెంట్రుకలు మొత్తంగా కాకుండా అక్కడక్కడ పోతుంటాయి. దీనివల్ల బట్టతల భాగాలు భాగాలుగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది తీవ్రమైన ఆత్మన్యూనతా భావనకు కూడా గురిచేస్తుంది. గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు.

పేను కొరుకుడుఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు. మానసిక ఆందోళన, థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు.

పేను కొరుకుడునిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది. ఈ పేను కొరుడు సమస్య ఉన్నట్టయితే తలలో ఎక్కువగా దురద పుట్టడంతో పాటు.. వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్యకు చక్కటి మందు ఉందని గృహ వైద్యనిపుణులు చెబుతున్నారు.

పేను కొరుకుడుఈ సమస్యకు అసలు వైద్యమే లేదనుకుని చాలా మంది ఆ వ్యాధి ఇంకా ఇంకా పెద్ద దయ్యేదాకా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. వాస్తవానికి ఈ సమస్యకు పలు రకాల విరుగుడు మార్గాలు ఉన్నాయి. వాటిని వాడడం వలన ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది.

పేను కొరుకుడుచందన తైలాన్ని ప్రతిరోజూ మూడు పూటలా వెంట్రుకలు ఊడిపోయిన చోట రాస్తూ ఉంటే ఆ భాగంలో వెంట్రుకలు మళ్లీ మొలిచే అవకాశం ఉంది. గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది. రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది. నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది.

పేను కొరుకుడుతల మీద పేను కొరికిన ప్రదేశంలో మంగ పూలతో రుద్దితే, ఆ చోట మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి. వేరు బెరడుకు సమానంగా శీకాయ పొడినిగానీ, కుంకుమ కాయ పొడినిగానీ కలిపి దానితో తలస్నానం చేస్తే చుండ్రు పోవడంతో పాటు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. మంగచెట్టు బెరడునుగానీ, వేరు బెరడునుగానీ, మెత్తగా నూరి కుంకుడుకాయలా తలకు రుద్దితే, నేత్రవ్యాధులు, తలనొప్పి తగ్గుతాయి. పేలు చనిపోతాయి. ఇది మెదడుకు, కళ్లకు చలువ చేయడంతో పాటు శిరోవాతం తగ్గిపోతుంది.

పేను కొరుకుడుమంగ చెట్టు కాండపు బెరడును ఎండించి చూర్ణం చేసి, ఆ చూర్ణాన్ని కొంచెం నువ్వుల నూనెలో కలిపి, నొప్పిగా ఉన్న చోట మర్దన చేస్తే కండరాల నొప్పులు తగ్గుతాయి. మంగకాయ, అతి మధురం ఈ రెంటినీ సమానంగా తీసుకుని, చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే ఆస్తమా, ఎలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యలు తగ్గిపోతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR