శుభకార్యాలలో రెండు వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి?

హిందూ సంప్రదాయం ప్రకారం ఎటువంటి కార్యం చేసిన దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించటం వెనుక అంతరార్ధం ఏమిటో మనలో చాల మందికి తెలియదు. ఆచారం ,అందరూ వెలిగిస్తారు కాబట్టి మనమూ వెలిగిస్తున్నాం అనేవాళ్ళు లేకపోలేదు. ఇంకా వత్తుల విషయానికి వస్తే ఏఏ సందర్భంలో ఎన్ని వత్తులు వేసి వెలిగించాలి అనే విషయం అవగాహన లేదు. వత్తుల సంఖ్య ఏ సందర్భంలో ఎంత ఉండాలో తెలుసుకుందాం.

Deepamప్రమిద లేక కుండీలో రెండు వత్తులు వేసి దీపం వెలిగించడం శుభసూచకం. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మా. కనుక శుభకార్యాలలో, పూజలలో రెండు వత్తులు వేసి వెలిగించాలి. శవం తల వెనుక,శ్రాద్దకర్మలప్పుడు ఒకే వత్తి వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం ఇక దీపారాధనలో నూనె శనికి ప్రతినిధి. దీపం సూర్యునికి ప్రతీక, మనకు, మన ఇంటికీ వుండే దోషాల నివారణార్ధం మనకు వెలుగు (తెజస్సు ) కలగాలని, నూనె హరించినట్లే మన కష్టాలు హరించి, వెలుగు రావాలని దీపారాధన ప్రధాన ఉదేశ్యం.

Deepamసూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.దీపాలు తూర్పుముఖంగా వుంటే ఆయువు పెరుగుతుంది. ఉత్తరదిశ ముఖంగా వుంటే అన్ని విధాలా ధనాభివృద్ధి కలుగుతుంది.నాలుగు దిక్కులలో ఒకేసారి దీపాలు పెడితే ఏ దోషము పొడవున వుండదు.సంవత్సరం పొడవున దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR