శ్రీ కృష్ణుడు సత్యభామ కలసి పారిజాతవృక్షాన్ని ఎందుకు దొంగలించారు?

పారిజాత పుష్పాలతో దేవతలకి పూజ ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ప్రపంచంలో ఏ ఇతర చెట్టుకి లేని ప్రత్యేకత పారిజాత వృక్షానికే స్వంతం అని చెబుతుంటారు. అయితే ఒక సందర్భంలో నారదుడు పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడికి ఇవ్వగా ఆ పుష్పాన్ని తనకు ఇవ్వలేదని సత్యభామ అలగడంతో తన కోసం దేవలోకం వెళ్లి పారిజాత వృక్షాన్ని దొంగలించి తీసుకువచ్చాడని కథ వృత్తాంతం. మరి సత్యభామ అలగడానికి కారణం ఏంటి? శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని భూమిమీదకు ఎలా తీసుకువచ్చాడు? పారిజాత వృక్షానికి ఉన్న గొప్ప తనం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

parijatham kathaశ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన అష్టదిగ్గ కవులలో ఒకరైన నంది తిమ్మన పారిజాతాపహరణ గ్రంధాన్ని రచించాడు. అయితే నారదుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుండి పారిజాత వృక్షాన్ని తన వెంట తీసుకువచ్చి దేవలోకంలో మాత్రమే లభించే ఈ అపురూప పుష్పం మీకు ఇస్తున్నాను, ఈ పారిజాతపుష్పాన్ని మీకు బాగా నచ్చినవారికి ఇవ్వమని చెప్పగా, అప్పుడు అంతఃపురంలో శ్రీకృష్ణుడి వెంట రుక్మిణి ఉండగా ఆ పుష్పాన్ని రుక్మిణికి ఇస్తాడు. అప్పుడు నారదుడు రుక్మిణి పొగుడుతూ ఉండగా, ఈ విషయాన్నీ చెలికత్తెలు వెళ్లి సత్యబామతో చెబుతారు.

parijatham katha

ఆ అరుదైన పుష్పాన్ని తనకి ఇవ్వకుండా రుక్మిణికి ఇవ్వడంతో అక్కడ తనకి అవమానం జరిగిందని, అందరికంటే ఎక్కవ ప్రాధన్యత శ్రీకృష్ణుడు తనకే ఇస్తాడని భావించ కానీ ఆ నమ్మకం ఇప్పుడు పోయిందని సత్యభామ అలుగుతుంది. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ దగ్గరికి వచ్చినప్పుడు అలిగి ఉన్న సత్యభామ ని చూసి తన అలకకి కారణం పారిజాత పుష్పమే అని తెలుసుకొని, తన మాయమాటలతో కృష్ణుడు ఎంత ప్రయత్నించినా సత్యభామ అలానే ఉండటంతో, శ్రీకృష్ణుడు తనకి పారిజాత పుష్పాన్నే ఇచ్చాను నీకు ఏకంగా పారిజాత వృక్షాన్నే ఇస్తానని చెప్పడంతో అప్పుడు సత్యభామ సంతోషించింది.

parijatham katha

ఇక తానూ దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యబామతో కలసి బయలుదేరుతాడు. ఇలా దేవలోకానికి వెళ్లి వన విహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టుని పెకిలించి తీసుకువెళుతుండగా ఇంద్రుడు అడ్డుకొని శ్రీకృష్ణుడితో యుద్దానికి దిగి చివరకు ఓటమిని అంగీకరించి పారిజాతవృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు. అప్పుడు సత్యబామతో కలసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని సత్యభామ అంతఃపురం దగ్గర పేరెట్లో నాటుతాడు.

parijatham katha

పారిజాత వృక్షం విషయానికి వస్తే, ప్రపంచంలో కెల్లా ఎంతో విలక్షణమైన వృక్షం ఇదేనని శాస్త్రవేత్తలు సైతం పరిశోధనలు చేసి మరి చెప్పారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. ఈ చెట్టు కింది భాగంలో చెట్టు ఆకులూ చేతి ఐదు వేళ్ళని పోలి ఉంటాయి, ఇంకా పై బాగానే ఆకులూ ఏడు భాగాలుగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క పూలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. ఈ పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామంలో ఉంది. ఈ వృక్షం జూన్ – జులై నెలలో మాత్రమే వికసిస్తుంది. ఈ చెట్టు యొక్క పూలు బంగారు, తెలుపు రంగులో చాలా అందంగా ఉంటాయి. వీటి సుహాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయసు దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుండి ఐదు వేల సంవత్సరాలు. వృక్షం యొక్క కాండం చుట్టుకొలత 50 అడుగులు, ఎత్తు 45 అడుగులు. ఈ వృక్షం యొక్క విశేషం ఏంటంటే, ఈ చెట్టు యొక్క శాఖలు, ఆకులూ కుచించుకుపోయి కాండంలో కలసిపోవడమే కానీ ఎండిపోవడం, రాలిపోవడం లాంటివి జరగవు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR