Home Unknown facts శ్రీమహావిష్ణువుకి గదాధరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

శ్రీమహావిష్ణువుకి గదాధరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

0

శ్రీమహావిష్ణువు శంఖుచక్ర గదధారుడై అనంతుడి మీద శయనిస్తాడు. ఇలా శేషతల్పం పైన శయనించిన శ్రీమహావిష్ణువు పాదాల చెంత లక్ష్మీదేవి, నాభిలో బ్రహ్మ ఉంటారు. అయితే దుష్ట శిక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారాలు ఎత్తాడనీ చెబుతారు. ఇది ఇలా ఉంటె, శ్రీమహావిష్ణువు చేతిలో గద ఆయుధంగా ఉంటుంది. అందుకే ఆయన్ని గదాధరుడు అని కూడా అంటారు. మరి శ్రీమహావిష్ణువుకు గద ఆయుదంగా ఎలా అయింది? ఆయనకి గదాధరుడు అనే పేరు ఎందుకు వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Vishnu

పురాణానికి వస్తే, పూర్వం ఒకప్పుడు గద అనే పేరు గల రాక్షసుడు ఉండేవాడు. అయితే ఆ రాక్షసుడి ఎముకలు ఏ ఆయుధానికి విరగనంత గట్టివిగా ఉండే బలశాలి. ఈ గద రాక్షసుడు బ్రహ్మదేవుడికి గొప్ప భక్తుడు. ఇక ఒక రోజు బ్రహ్మదేవుడే వచ్చి అతని ఎముకలను తనకి దానం చేయమని అడుగగా, అప్పుడు దానికి వెంటనే గదుడు అంగీకరించి ప్రాణత్యాగం చేయగా, ఆ ఎముకలను బ్రహ్మ విశ్వకర్మకి ఇవ్వగా ఒక గొప్ప గదను తయారుచేసి బ్రహ్మకు ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటె, ఆ తరువాతి కాలంలో హేతి అనే మరొక రాక్షసుడు గొప్ప తపస్సు చేసి సమస్తకాలలో ఎవరికీ సంబంధించిన ఆయుధం వల్ల తనకు మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. ఇక ఈ వరం కారణంగా అందరిని హింసించడం మొదలుపెడితే అప్పుడు దేవతలందరు వెళ్లి మహావిష్ణువుని ప్రార్ధించగా అప్పుడు బ్రహ్మ దగ్గర ఉన్న గదను తీసుకొని దానితో హేతి అనే రాక్షసుడిని సంహరిస్తాడు.

ఇలా అప్పటినుండి శ్రీమహావిష్ణవుకి అయన నాలుగు చేతులలో ఉన్న ఆయుధాలలో గద కూడా ఒకటి అయింది. అందుకే ఆయనకి గదాధరుడు అనే పేరు వచ్చినదని పురాణం.

బీహార్ రాష్ట్రం, ఫల్గుణి నది ఒడ్డున గదాధర్ ఘాట్ లో గదాధర్ భగవాన్ దేవాలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ ఉన్న స్వామివారు చతుర్భుజాలను కలిగి ఉంటాడు. ఇలా శ్రీమహావిష్ణువు ఇక్కడ గదాధర్ భగవాన్ గా వెలిశాడని చెబుతారు.

Exit mobile version