పెళ్లైన కొత్త జంటలు ఆషాడంలో ఎందుకు కలిసి ఉండరో తెలుసా?

ఆషాడ మాసం వచ్చేసింది. మొన్నటి వరకు పెళ్లిళ్లు చేసుకున్న జంటలు దూరంగా ఉండాల్సిన విరహ మాసం ఇది. నాలుగవ మాసమైన ఆషాడ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఆషాఢం అంటే అందరికీ ఇష్టమైనా… కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుటాంరు. వివాహం అయిన తరువాత వచ్చే తొలి ఆషాఢంలో కొత్తగా అత్తారింకి వచ్చే కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతుటారు.

ఆషాడ మాసంఓ కవి ఆషాడ మాసాన్ని ఇలా వర్ణించాడు. ఆషాఢ మాసం కాదిది, నవదంపతుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల, అరూడ మాసం. ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటకు ఎడబాటు తప్పదు. అత్తా కోడళ్ళు కూడా ఎదురుపడకూడదనే ఆచారం ఉంది. అందుకే ఆషాడంలో కొత్త దంపతులు కలిసి ఉండకూడదని అంటారు. దీని వెనుక కూడా ఒక అర్థం ఉంది. పూర్వ కాలంలో వ్యవసాయమే జీవనాధారం. సంపాదన మాట అటు ఉంచి తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని, కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు.

ఆషాడ మాసంఅంతే కాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు.

ఆషాడ మాసందీన్ని అనారోగ్య మాసంగా పేర్కొంటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. కాలువల్లోనూ, నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులో పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది.

ఆషాడ మాసంఅలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాడంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలకి అంటే చైత్రం పూర్తవుతుంది. అంటే నిండు వేసవిలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ఎండలకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారని అంటారు కూడా.

ఆషాడ మాసంపూర్వకాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉండేది. కష్టపడి పనిచేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు. వర్షాధారంలో పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడిపోవాల్సిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి. అల్లుడు అత్తవారింటి వైపు చూడకూడదనే నియమం పెట్టారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR