దుర్ముహూర్తం, రాహుకాలం లేని సమయాలు చూసి ఎందుకు ఏదైనా పని చేస్తారు

ఏదైనా కార్యాన్ని ప్రారంభించేటప్పుడు తప్పకుండా చూడాల్సింది శుభ ముహూర్తం. ఏ కార్యానైనా మంచి ముహూర్తంలో ప్రారంభించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఎందుకంటే గ్రహాలు అనుకూలించినప్పుడే పనులు సక్రమంగా జరుగుతాయి, ఎటువంటి ఆటంకాలు రావు. అందుకే దుర్ముహూర్తం, రాహుకాలం లేని సమయాలు చూసి ఏదైనా పని చేస్తారు. అయితే దుర్ముహూర్తం అంటే ఏమిటి రాహుకాలం అంటే ఏమిటో తెలుసుకుందాం….

మానవ నిత్య జీవితంలో ఎన్నో సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణకు శుభ ముహూర్తాలు అవసరమవుతాయి. అయితే శుభ ముహూర్తాలతో పాటు దుర్మూహూర్తాలపై కూడా అవగాహన ఉండాలి. అప్పుడే మనం మంచి ముహూర్తమేంటో అర్థం చేసుకోగలం.

నక్షత్ర ప్రమాణాన్ని బట్టి విడువ తగిన కాలాన్ని వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి, వారమును బట్టి విడువ తగిన కాలమును దుర్మూహుర్తం, రాహూకాలం అంటారు.

3-Rahasyavaani-1088గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలంను గురించి చెప్పినట్లుగా లేదు. రాహు కాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతంలో వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.

దుర్ముహూర్తం వారానికి సంబంధించిన దోషం.
దీని ప్రమాణం 48 నిమిషాలు,

ఆదివారం సాయంత్రము 4-44 నుండి 5:36 వరకు

సోమవారం మధ్యాహ్నం 12-28 మరల 2-58 వరకు

మంగళవారం ఉదయం 8-30కు, మరల రాత్రి 11-50 వరకు

బుధ వారం ఉదయం 11-41 వరకు

గురువారం మధ్యాహ్నం 2-54 వరకు

శుక్రవారం మధ్యాహ్నం 12-28 వరకు

శనివారం ఉదయం 2-40 వరకు దుర్మహూర్తం వస్తుంది.

ఘడియల్లో ఆది-26, సోమ-16, 22 మంగళ-6 మళ్ళీ రాత్రి 11-50 బుధవారం-11ఘ, గురువారం-10, శుక్ర-16 శని-4 ఘడియలకు వస్తుంది.

2-Rahasyavaani-1088పంచకరహితము :- ముహూర్తం ఏర్పరచుకునే నాటికి తిధి, వార, నక్షత్ర లగ్న సంఖ్యలను కలిపిన మొత్తాన్ని 9చేత భాగించగా శేషము 3-5-7-9 ఉన్న ముహూర్థాలు రహితమైనవని గ్రహించాలి.1 మిగిలిన మృత్యు పంచకం అగ్నిపంచకం, 4 రాజ పంచకం, 6 చోర పంచకం, 8 రోగ పంచకం ఇవి దోషకరమైనవి.

శూన్యమాసము:- శూన్యమాసములో ఎటువంటి శుభకార్యం చేయరాదు. శూన్యమాసం, ఆషాఢం, భాద్రపదం, పుష్యం.. ఇవికాక మీన, చైత్రము, మిధునాషాఢము, కన్యాభాద్రపదము, ధనుఃపుష్యము. ఇవి శూన్యమాసాలే. సూర్యుడు ఆయా రాశులలో ఉన్నప్పడు శుభకార్యాల గురించి తలపెట్టరాదు.

మూఢము లేక మౌఢ్యమి :- రవితో కలసి గురు శుక్రులలో ఎవరైన చరించు వేళను మూఢమంటారు. అస్తంగత్వ దోషము ప్రాప్తించడం వల్ల శుభమీయజాలని కాలమిది. కాబట్టి ఎలాంటి శుభకార్యములైన ఈ కాలంలో చేయకూడదు.

కర్తరి:- కర్తరి అంటే సూర్యుడు భరణి 4పాదంలో కృత్తిక 4వ పాదములలోను, రోహిణి 1వ పాదంలో సంచరించు కాలాన్ని కర్తరి అంటారు. భరణీ 4వపాదము డొల్లకర్తరి అంత చెడ్డదికాదు. మిగతా కాలమంతా చాలా చెడ్డది. గృహనిర్మాణాది కార్యాలు, నుయ్యి త్రవ్వడం, దేవతా ప్రతిష్ట మొదలగునవి ఈ కాలంలో చేయరాదు.

త్రిజ్యేష్ట విచారణ:- తొలుచూలు వరుడు/ వధువు జ్యేష్ట మాసం, జ్యేష్ట నక్షత్రం వీటి మూడింటిని త్రిజ్యేష్ట అని అంటారు. వీటిలో ఒక జ్యేష్టం శుభకరం. రెండు జ్యేష్టలు మధ్యమం. మూడు జ్యేష్టలు హానీ. కాని తొలిచూలు వరకు ద్వితీయాది గర్భజాతక కన్యను ద్వితీయాది గర్భజాతకుడు అయినటువంటి వరుడు పెళ్లాడినప్పుడు జ్యేష్టమాసం శుభకరమైందే.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR