Home Unknown facts భారతీయ సంస్కృతిలో శంఖంకు ఎందుకు అంత ప్రత్యేకమైన స్థానం

భారతీయ సంస్కృతిలో శంఖంకు ఎందుకు అంత ప్రత్యేకమైన స్థానం

0

శంఖం అనేది సర్వ సంపదలకు ప్రతీక. ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట పండుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి , విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి ,శంఖం … సముద్రుని సంతానం.

శంఖంశంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. పూర్వం పాల సముద్రంలో నివాసం ఉంటున్న లక్ష్మి నారాయణులని నివాసం ఉన్నందుకు గాను పైకం చెల్లించమని సముద్రతనయుడు(శంఖం) అడుగుతాడు. కానీ ఆ సమయంలో అతనికి అహంకారం వల్ల కన్ను మిన్ను కనపడదు. నారాయణుడు ఎంత చెప్పిన వినకుండా లక్ష్మిని ఇచ్చేయమని వాదిస్తాడు. విష్ణుమూర్తి కి కోపం వచ్చి గదతో కొడతాడు శంఖం వెయ్యి ముక్కలవుతుంది. సముద్రుడు ఆగ్రహంతో లక్ష్మి నీకు దూరం అవుగాక అని శపిస్తాడు.

కొన్నాళ్ళకు ఒక ముని వల్ల లక్ష్మి సముద్రంలో దూకి సముద్రునికి పుత్రికగా జన్మిస్తుంది. వేయి ముక్కలుగా ఉన్న శంఖాలతో విష్ణు మూర్తి విగ్రహం చేసి ఆరాధిస్తుంది లక్ష్మి అమ్మవారు. అప్పటి నుండి శంఖం లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీన్నీ ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు.

శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. ఈ శంఖాల పేర్లు… 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం,

శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు.

రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుయొక్క పాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.

 

Exit mobile version