గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలి? దాని వెనుక కారణం ఏంటి

0
285

గుడి వెళితే ముందుగా గుర్తుకు వచ్చేది తీర్థ ప్రసాదాలు. తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో, పురుష సూక్తం ,పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును అర్ఘ్యపాద్య ఆచమనములు పుజచేసే వేళ సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్రలో ఉంచి తులసీదళ సహితమైన జలాన్ని తీర్ధముగా ఇస్తారు.

Why take Tirtha in temples?ఈ తీర్ధమును అర్చన పూర్త అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత తన్మయులైన వారికీ, సన్యసించిన వారికినీ , అధ్యాపకులకూ యజమానులైన ధర్మకర్తలకునూ ఆ తర్వాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలిబాహ్యశుద్ధి, అంతశ్శుద్ధి అని శుద్ధి రెండు రకాలు. తీర్థము అంతశ్శుద్ధికి కల్పించబడింది. మనం ప్రతిరోజు స్నానమాచరించి బాహ్యశుద్ధి చేసుకోగలం. కామ, క్రోధ, లోభ, మహ, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములను జయించినవాడే పరమ పదమును పొందలడు. ఈ అంశ్శత్రువులను జయించుటకు మనస్సు శుద్ధి చేసుకొనుటకోసం తీర్థము గ్రహించాలి. తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్మాత్మికత శక్తి మెరుగవుతాయి.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. ద్వితీయంగా స్వీకరించే తీర్థం ధర్మసాధన కోసం, తృతీయంగా తీసుకునే తీర్థం మోక్షము సిద్ధించేందుకు. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే భోజనం చేసినంత భక్తి వస్తుంది.

గుళ్లో తీర్థం ఎందుకు తీసుకోవాలితీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భావంతో తీసుకోవాలి. మూడుసార్లు కూడా కుడిచేయి కింద ఎడమచేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే మంచిది.

 

SHARE