Home Unknown facts సూర్యోదయానికి ముందు దీపం ఎందుకు వెలిగించాలో తెలుసుకోండి!

సూర్యోదయానికి ముందు దీపం ఎందుకు వెలిగించాలో తెలుసుకోండి!

0

దేవాలయాల్లోనూ, ఇళ్లల్లోనూ పూజ చేసేప్పుడు దీపంతోనే పూజ ప్రారంభిస్తాం. ఇంట్లో ఎటువంటి శుభాకార్యాలు జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సాంప్రదాయంలో భాగం. అంటే దీపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. దీపాలను గౌవరంతో, భక్తి శ్రద్ధలతో వెలిగించుకోవాలి. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉందని హిందువుల నమ్మకం. దీపారాధ‌న చేయ‌గానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింత‌లు వేయాలి. దీప పీఠ భాగ‌ము బ్ర‌హ్మ‌తో స‌మానం. స్తంభం విష్ణు రూపం, ప్ర‌మిద ప‌ర‌మేశ్వ‌రుడ‌ని, దీప‌తైలం నాదం, వ‌త్తి అగ్ని దేవుడిగాను భావ‌న ఉంది. వెలుగు శ‌క్తి స్వ‌రూపం.

సూర్యోదయానికి ముందు దీపంసృష్టి మొత్తం శ‌క్తి నుండి ఏర్పడినప్పుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచప్రణవాలు అన్ని ఆ తల్లి రూపమే. అలా అగ్ని రూపంలో అమ్మవారు సాక్షాత్తు శక్తి గా వ్యక్తం అవుతుంది. ఆ తల్లి చిదగ్ని నుండే రూపు దాల్చుతుంది..ఈ అగ్ని ద్వారానే హావిస్సు రూపంలో దేవతలకు శక్తి అందుతుంది.. ఈ నిత్య అగ్నిహోత్రం ఎంతో గొప్ప అనుష్ఠానం.. జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది. అగ్ని వాక్కుగా ముఖంలో, వాయువు ఘ్రాణముగా నాసికలో, ఆదిత్యుడు దృష్టిగా నేత్రాలలో, దిశలు శ్రవణేంద్రియాలుగా చెవుల యందు, జలం వీర్యముగా శిశ్న మందు, మృత్యువు అపానముగా నాభి యందు ప్రవేశించగా, ఈశ్వరుడు శరీరం నిలబడడానికి శిరస్సు ద్వారా పైనుండి బ్రహ్మ రంధ్రములోనికి ప్రవేశిస్తాడు. అగ్ని నుండి సమస్త ప్రపంచం ఏర్పడింది. సూర్యుడు కూడా అగ్ని స్వరూపుడే. రాత్రి, పగలు అగ్ని యొక్క సంతానం.

అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపం లో దర్శనం చేయాలి. దీపం జోతిలోకి ఆ తల్లిని ఆవాహన చేసి ఆ దీపంలో ఉపాసించాలి. అగ్నిలో ఆమె ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది. ఇది దీప దుర్గా ఉపాసనలో అనుభవం అవుతుంది.. దీపాలు వెలిగించి చేసే ప్రార్ధనకి అందుకే అంత శక్తి ఉంటుంది.. దీపాలతో దీప కాంతి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఉపాసన చేస్తారు. ఈ ఉపాసనలో ఆ కాంతి అమ్మవారి ఆకారంలోనే ప్రత్యక్షంగా పూజను స్వీకరిస్తుంది.. ఇది పద్దతిగా గురువు నుండి సాధన నేర్చుకుని చేయాలి.. అలా ఆవాహన చేసిన తల్లి ని దేవి మహత్యం స్తోత్రాలతో ఉపదేశం పొందిన మంత్రం యొక్క సంపుటికరణ స్త్రోత్రం, అర్చనతో పూజించి ఆ స్వరూపం అంతర్ధానం అయే వరకు మనసులో నే మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా ఆ శక్తి మనలోకి చేరిపోతుంది.

ఈ సాధన కోరికలతో చేయాకుడదు అమ్మవారి అనుగ్రహము పొందడానికి చేయాలి ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఆ కాంతిలో అనుభూతి చందుతూ ఒకరకమైన భయం తో కూడిన భక్తి ఏర్పడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది. నేరుగా ఆమెను చూసే ధైర్యం సరిపోక చూపు ఆమె పాదాలను వెతుకుతుంది.. అలా చూస్తూ చేసే శక్తి లేక ధ్యానంలో కి వెళ్ళిపోయి ఉపాసన కొనసాగిస్తారు. లేకుంటే భయంతో మైకం వచ్చి పడిపోతారు.. నిదానంగా అలవాటు అయిన కొద్దీ ఆ భయం తగ్గక పోయిన ధైర్యంతో సాధన కొనసాగించడం అలవాటు అవుతుంది. క్రమంగా ఈ సాధన సమయం కూడా పెరుగుతుంది.

అకండ దీపం లో అమ్మవారిని భావించి చేసే మండల దీక్షకు కూడా అంత శక్తి ఉంటుంది. ఈ ఉపాసన అంతా తెలియక పోయినా ప్రాతః కాలం సూర్యోదయానికి పూర్వం ఎక్కడ దీపం వెలుగుతుందో ఆ ఇంటిని ఆ దీపం రూపంలో అమ్మవారు రక్షిస్తుంది. దీపానికి ఒక్కో సమయానికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు ఉదయం 5 గం దీపంలో వినాయకుడు అధిపతిగా ఉంటారు , 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది ఆ తల్లి దీపంలో కొలువై నరాయణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఎక్కడ లక్ష్మీ కొలువై స్వామిని ఆరాధిస్తారో ఆ ఇంటిపైన నారాయణుడి దృష్టి పడుతుంది.

అగ్ని రూపం సాక్షాత్తు అమ్మవారే ఆ అగ్నిని దీపం రూపంలో ఆరాధిస్తే అంతకంటే గొప్ప ఉపాసనా సాధన ఏముంటుంది? ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, అగ్నిహోత్రం అలవాటు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆ తల్లిని ప్రత్యక్షంగా ఆరాధించినట్టు..దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి..ఆ తల్లి మీ ఇంటికి దీపమై చీకటిని మాపి వెలుగును నింపుతుంది.

 

Exit mobile version